తమిళనాడులోని కోయంబత్తూరులో ఈషా ఫౌండేషన్ నిర్వహించిన మహాశివరాత్రి ఉత్సవాలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుధవారం హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలోని పురాతన భాష అయిన తమిళంలో తాను మాట్లాడలేకపోవడం బాధగా ఉందన్నారు. అక్కడికి వచ్చిన భక్తులకు క్షమాపణలు కోరారు.
Amit Shah: పార్లమెంట్ ఎంపీ నియోజకవర్గాల పునర్విభజనపై తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వం, సీఎం ఎంకే స్టాలిన్, కేంద్రంపై విమర్శలు గుప్పిస్తున్నారు. డీలిమిటేషన్‌పై చర్చించడానికి మార్చి 5న అఖిలపక్ష సమావేశానికి కూడా ఆయన పిలుపునిచ్చారు. జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన జరిగితే తమిళనాడు 8 లోక్‌సభ స్థానాలను కోల్పోతుందని ఆయన ఆరోపిస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అదనంగా జాతీయ విపత్తు నిర్వహణ నిధి (NDRF) నిధులను ఇవ్వనుంది. కేంద్ర హోంశాఖ మంత్రి శ్రీ అమిత్ షా బుధవారం ఈ నిధుల విడుదలకు ఆమోదముద్ర వేశారు. తెలంగాణతో పాటుగా ఐదు రాష్ట్రాలకు కలిపి రూ.1,554.99 కోట్లు విడుదల కానున్నాయి. ఇందులో తెలంగాణ వాటా కింద రూ.231.75 కోట్లు అందనున్నాయి. గతేడాది ఆయా రాష్ట్రాలకు విడుదల చేసిన ఎన్బీఆర్ఎఫ్ నిధులకు..
కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌గా జ్ఞానేష్ కుమార్‌ను అర్ధరాత్రి నియమించడంపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రంగా తప్పుపట్టారు. కొత్త సీఈసీ ఎంపిక కమిటీలో భారత ప్రధాన న్యాయమూర్తిని తొలగించడం ద్వారా సుప్రీంకోర్టు ఆదేశాన్ని ఉల్లంఘించడమేనని విమర్శించారు.
V.Hanumantha Rao : సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ వీ. హనుమంతరావు (వి.హెచ్) కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అధికార దుర్వినియోగంతో పాటు, రాజకీయ కక్ష సాధింపులో భాగంగా ప్రతిపక్ష నేతలపై కేసులు బనాయిస్తూ, అధికార పార్టీకి చెందిన నేతలపై చేసిన ఫిర్యాదులను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. వీహెచ్ మాట్లాడుతూ, 2022 డిసెంబర్ 16న రాహుల్ గాంధీపై దేశ రక్షణకు సంబంధించిన అనుచిత వ్యాఖ్యల కేసు నమోదు చేసి, మార్చి 24న…
Parvesh Varma: ఢిల్లీలో బీజేపీ ఘన విజయం సాధించింది. ఆప్ అగ్రనేతల్ని ఓడించి మరీ ఢిల్లీని కైవసం చేసుకుంది. మొత్తం 70 స్థానాలు ఉన్న ఢిల్లీలో 48 చోట్ల బీజేపీ, 22 చోట్ల ఆప్ విజయం దాదాపు గా ఖరారైంది.
Amit Shah : జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదంపై పోరాటాన్ని ముమ్మరం చేయాలని, చొరబాట్లను సున్నాకి తగ్గించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుధవారం అన్ని భద్రతా సంస్థలను ఆదేశించారు.
రవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ.. తమ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతూ భారతీయ జనతా పార్టీ రౌడీయిజం చేస్తుందని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో మరోసారి ఆప్ విజయం సాధిస్తుందన్నారు. ఇది బీజేపీ నాయకులకు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు నచ్చడం లేదు.. అందుకే మాపై దాడులకు, బెదిరింపులకు దిగుతున్నారని పేర్కొన్నారు.
Mahakumbh 2025 : కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేడు మహా కుంభమేళాలో పవిత్ర స్నానం చేయనున్నారు. నిన్న అంటే ఆదివారం నాడు ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ గంగానదిలో స్నానం చేశారు.