Pahalgam terror attack: జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడి యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. అధికారికంగా వస్తున్న సమాచారం ప్రకారం, ఇప్పటి వరకు ఒకరు మృతి చెందగా, 12 మంది గాయపడినట్లు తెలుస్తోంది. అయితే, అనధికారికంగా మృతుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుదనే వార్తలు వినిపిస్తున్నాయి. పహల్గామ్‌లోని బైసరన్ గడ్డి మైదానాలను చూసేందుకు వచ్చిన టూరిస్టుల్ని లక్ష్యంగా చేసుకుని టెర్రరిస్టులు దాడికి పాల్పడ్డారు. పక్కా పథకం ప్రకారమే దాడి చేసినట్లు తెలుస్తోంది.
Read Also: Gudivada Amarnath: షెల్ కంపెనీలకు ప్రభుత్వ భూములను కట్టబెడుతున్నారు..
టెర్రరిస్టులు ఆర్మీ యూనిఫాం ధరించి, ప్రజల్ని మభ్య పెట్టారు. టెర్రరిస్టులు ట్రెక్కింగ్ చేస్తున్న వారిపై అతి దగ్గర నుంచి కాల్పులు జరిపారు. మొత్తం ఏడుగురు టెర్రరిస్టులు పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఈ దాడికి పాల్పడింది మేమే అని లష్కరే తోయిబా అనుబంధ ఉగ్రసంస్థ ‘‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’’ బాధ్యత ప్రకటించుకుంది. ఈ దాడిపై ప్రధాని మోడీ సౌదీ నుంచి ఆరా తీశారు. సంఘటన స్థలానికి వెళ్లాలని హోంమంత్రి అమిత్ షాని ఆదేశించారు.
దాడికి సంబంధించిన భయానక సన్నివేశాలను ప్రత్యక్ష సాక్ష్యులు పంచుకున్నారు. ‘‘మేము భేల్‌పురి తింటున్నాము. ఆ సమయంలో టెర్రరిస్టులు తన భర్తని కాల్చారు.’’ అని భయపడుతున్న గొంతుతో ఒక మహిళ చెప్పింది. ‘‘నా భార్త ముస్లిం కాదని చెబుతూ టెర్రరిస్టులు అతడిని కాల్చారు’’ అని చెప్పారు. టెర్రరిస్టులు ముఖ్యంగా ముస్లిం కాని వారిని టార్గెట్ చేస్తూ కాల్పులు జరిపారు. టూరిస్టుల పేరు, మతం అడిగి టెర్రరిస్టులు దారుణానికి ఒడిగట్టారు. దాడికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరో మహిళ, తన భర్త ప్రాణాలు కాపాడాలంటూ కన్నీటితో వేడుకుంటున్న వీడియో కనిపించింది. దాడి తర్వాత, సంఘటనా స్థలానికి చేరకున్న భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నాయి. ఉగ్రవాదుల వేట ప్రారంభమైంది. గాయపడిన వారిని సమీప ఆస్పత్రులకు తరలించారు.