CM MK Stalin: 2026లో తమిళనాడులో ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తిప్పికొట్టారు. మా తమిళనాడు రాష్ట్రం ఎప్పటికీ ఢిల్లీ నియంత్రణలో ఉండదని అన్నారు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వారసుడిగా ఎవరొస్తారన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. త్వరలోనే బీజేపీ జాతీయ అధ్యక్షుడిని ప్రకటించనుంది. ఏప్రిల్ 22, 23 తేదీల్లో ప్రధాని మోడీ సౌదీ అరేబియాలో పర్యటించనున్నారు.
ఇక, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కుట్రలు చేసి అధికారంలోకి రావడానికి అమిత్ షా చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవాలని నేను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కోరుతున్నాను అని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పేర్కొనింది.
Amit Shah: ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి ప్రతీ భారతీయుడికి బోధించాలని, ప్రతీ తల్లి తన బిడ్డకు చెప్పాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం అన్నారు. ప్రతీ భారతీయుడికి మాతృభూమికి సేవ చేయడం, సుపరిపాలనలో ఆదర్శవంతమైన మరాఠా సామ్రాజ్య స్థాపకుడి గురించి చెప్పాలని కోరారు.
MK Stalin: తమిళనాడులో బీజేపీ-అన్నాడీఎంకే పొత్తను శుక్రవారం అమిత్ షా ప్రకటించారు. రెండు పార్టీలు కలిసి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. అయితే, ఈ పొత్తుపై అధికార డీఎంకే పార్టీ విమర్శలు గుప్పిస్తోంది. ఈ పొత్తుని ‘‘ఓటమి అవినీతి కూటమి’’గా తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అభివర్ణించారు. అధికారం కోసమే ఈ రెండు పార్టీలు రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టాయని ఆరోపించాడు.
Annamalai: తమిళనాడులో అన్నాడీఎంకే, బీజేపీ పొత్తు పొడిచింది. చెన్నైలో ఈ రోజు జరిగిన సమావేశంలో పొత్తుపై అమిత్ షా క్లారిటీ ఇచ్చారు. పళనిస్వామి నేతృత్వంలో రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. ఇదిలా ఉంటే, ఇదే రోజు తమిళనాడు బీజేపీ చీఫ్గా అన్నామలై దిగిపోయి,
Amit Shah: శుక్రవారం చెన్నైలో బీజేపీ-అన్నాడీఎంకే పొత్తును అమిత్ షా అధికారికంగా ధ్రువీకరించారు. వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయబోతున్నట్లు వెల్లడించారు. విలేకరుల సమావేశంలో మాట్లాడిన అమిత్ షా, అధికార డీఎంకే ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ తమిళ భాష, తమిళ సంస్కృతిని గౌరవిస్తుందని, సీఎం స్టాలిన్ తమిళ భాష కోసం ఏం చేశారని ప్రశ్నించారు.
AIADMK-BJP: తమిళనాడు ప్రతిపక్ష పార్టీ అన్నాడీఎంకే, బీజేపీ మధ్య పొత్తు కుదిరింది. వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. మాజీ సీఎం ఎడప్పాడి పళని స్వామి నేతృత్వంలో రాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు చెప్పారు. చెన్నైలో జరిగిన విలేకరుల సమావేశంలో పొత్తుపై అమిత్ షా క్లారిటీ ఇచ్చారు.
తమిళనాడు బీజేపీ చీఫ్గా అన్నామలై వారసుడిగా నైనార్ నాగేంద్రన్ రానున్నట్లు సమాచారం. ప్రస్తుతం కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెన్నైలో పర్యటిస్తున్నారు. అన్నామలై వారసుడిని అధికారికంగా శనివారం ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.
Amit Shah: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కాసేపట్లో తమిళనాడు పర్యటనకు వెళ్లనున్నారు. ఇక, ఈ సందర్భంగా రాష్ట్రంలో తర్వలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్నారు.