Kishan Reddy : ఇవాళ చెన్నైలో నియోజకవర్గాల పునర్విభజనపై బీజేపీని వ్యతిరేకించే పక్షాలు- కాంగ్రెస్, బీఆర్ఎస్, డీఎంకే, కమ్యూనిస్టులు సమావేశమవడం.. ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్న చందంగా ఉందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి అన్నారు. అసలు నియోజకవర్గాల పునర్విభజనకు అనుసరించాల్సిన విధి విధానాలు ఖరారు కానే కాలేదు, నియమ నిబంధనలు రూపొందించనే లేదు, కానీ దక్షిణాదికి అన్యాయం జరుగుతుందంటూ ఈ…
Amit Shah: ‘హిందీ’ భాషపై తమిళనాడు, కేంద్రం మధ్య వివాదం చెలరేగిన నేపథ్యంలో శుక్రవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. భాష పేరుతో దేశంలో ఇప్పటికే తగినంత విభజనలు జరిగాయి, ఇకపై అది జరగకూడదు’’ అని ఆయన అన్నారు.
Amit Shah: కేంద్రం హోంమంత్రి అమిత్ షా రాజ్యసభలో ప్రసంగిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. హోంమంత్రిత్వ శాఖ పనితీరుపై జరిగిన చర్చలో సమాధానమిస్తూ.. ‘‘ఈ దేశంలో మార్చి 31, 2026 నాటికి నక్సలిజం నిర్మూలించబడుతుందని చెబుతున్నా’’ అని అన్నారు. ఇటీవల, వరసగా జరుగుతున్న ఎన్కౌంటర్లలో పదుల సంఖ్యలో మావోయిస్టులు మరణిస్తున్నారు.
Chhava: ఔరంగజేబు సమాధిని తొలగించాలనే వివాదం, నాగ్పూర్ ఘర్షణల నేపథ్యంలో ‘‘ఛావా’’ సినిమాని బ్యాన్ చేయాలని మతాధికారి డిమాండ్ చేశారు. బరేల్వీ మత గురువు మౌలానా షాబుద్దీన్ రజ్వీ కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. మొఘల్ పాలకుడు ఔరంగజేబు పాత్రని రెచ్చగొట్టే విధంగా చిత్రీకరించాలని లేఖలో ఆరోపించారు. ఇది వల్ల మతపరమైన అశాంతిని రెచ్చగొట్టే విధంగా ఉందని ఆరోపిస్తూ ‘‘ఛావా’’ని నిషేధించాలని కోరారు. ఆల్ ఇండియా ముస్లిం జమ్మత్ దర్గా ఆలా హజ్రత్…
నక్సలైట్లకు అమిత్ షా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. వచ్చే మార్చి 31 వరకు నక్సలిజం లేకుండా చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. మన సైనికులు 'నక్సల్ ఫ్రీ ఇండియా క్యాంపెయిన్' దిశలో మరో పెద్ద విజయాన్ని సాధించారని కొనియాడారు. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్, కాంకేర్లలో మన భద్రతా దళాలు నిర్వహించిన రెండు వేర్వేరు ఆపరేషన్లలో 22 మంది నక్సలైట్లు చనిపోయారని తెలిపారు.
రాజ్యసభలో చర్చ సందర్భంగా టీఎంసీ ఎంపీ సాకేత్ గోఖలే కేంద్ర దర్యాప్తు సంస్థల గురించి ప్రశ్నలు లేవనెత్తారు. హోం మంత్రిత్వ శాఖను ఇరుకున పెట్టడానికి ప్రయత్నించారు. దీనిపై హోంమంత్రి అమిత్ షా స్పందించిన సర్ది చెప్పడానికి ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో అమిత్ షా సంచలన విషయాన్ని వెల్లడించారు. సీబీఐ, ఎంపీ సాకేత్ చెబుతున్న కేంద్ర దర్యాప్తు సంస్థలు హోం మంత్రిత్వ శాఖ పరిధిలోకి రావని ఆయన అన్నారు. కాబట్టి, ప్రశ్నలు లేవనెత్తే ముందు, వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవాలని…
Minister Amit Shah: కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన ఈశాన్య భారత పర్యటన సందర్భంగా శనివారం (మార్చి 15) మిజోరాంలో ఓ ప్రత్యేక క్షణాన్ని ఆస్వాదించారు. మిజోరాంకు చెందిన ఏడేళ్ల గాయనీ ఎస్తేర్ లాలదుహావమీ హనామ్తే పాటకు కేంద్రమంత్రి అమిత్ షా మంత్రముగ్ధుడయ్యాడు. దింతో ఆ చిన్నారికి గిటార్ ను బహుకరించారు. ఈ సందర్భంగా, అమిత్ షా తన అధికారిక X (Twitter) ఖాతాలో వీడియోను షేర్ చేస్తూ.. భారతదేశం పట్ల ప్రేమ మనందరినీ కలిపే…
హిందీపై తమిళనాడు-కేంద్ర ప్రభుత్వం మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తమిళనాడుపై కేంద్రం బలవంతంగా హిందీ రుద్దుతోందని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ధ్వజమెత్తారు. దక్షిణాది రాష్ట్రాలపై బలవంతంగా హిందీ రుద్దీ.. బీజేపీ గెలవాలని చూస్తోందని ఇటీవల డీఎంకే నేతృత్వంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో నేతలు పేర్కొన్నారు.
డీలిమిటేషన్పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలను సీపీఎం రాఘవులు తప్పుపట్టారు. అమిత్ షా చాలా మోసపూరితంగా మాట్లాడారన్నారు. బీజేపీ అనుకున్న రాష్ట్రాలకు మాత్రమే ఎంపీ సీట్లు పెరిగితే.. అది మోసం కాదా..? అని నిలదీశారు.
Amit Shah: ఢిల్లీలో అక్రమ బంగ్లాదేశీయలు, రోహింగ్యాలే టార్గెట్గా ఈ రోజు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కీలక సమీక్ష నిర్వహించారు. శాంతిభద్రతలు, అభివృద్ధి అంశాలపై ఆయన సమావేశం నిర్వహించారు. సమీక్షకు ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా, ఢిల్లీ హోం శాఖ మంత్రి ఆశిష్ సూద్, ఢిల్లీ పోలీస్ కమిషనర్ హాజరయ్యారు. ఢిల్లీని సేఫ్ క్యాపిటల్ గా అభివృద్ధి చేయాలని అమిత్ షా ఆదేశించారు.