శ్రీనగర్ పోలీస్ కంట్రోల్ రూమ్‌లో పహిల్గామ్ మృతదేహాలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాళులర్పించారు. మృతదేహాలను స్వస్థలాలకు తరలించేందుకు ప్రత్యేక విమానాలను కేంద్రం ఏర్పాటు చేసింది. మంగళవారం పహిల్గామ్‌లో జరిగిన ఉగ్ర దాడిలో దాదాపు 26 మంది చనిపోయినట్లుగా తెలుస్తోంది. పదుల కొద్దీ గాయపడ్డారు. మృతులంతా ఆయా రాష్ట్రాలకు చెందిన వారుగా ఉన్నారు.
ఇది కూడా చదవండి: Pakistan : ఆ ఉగ్రదాడికి మాకు ఎలాంటి సంబంధం లేదు: పాక్ రక్షణ మంత్రి
ఉగ్రవాదులు కేవలం పురుషులనే టార్గెట్ చేసుకున్నారు. మహిళలు, పిల్లల జోలికి రాలేదు. కుటుంబ సభ్యుల ముందే పేర్లు, ఐడీ కార్డులు చెక్ చేశాకే తూటాలు కురిపించారు. ముస్లింలు అయితే వదిలి పెట్టేశారు. హిందువులే టార్గెట్‌గా ముష్కరులు చెలరేగిపోయారు.
ఇక ఈ ఉగ్ర దాడిని ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండించాయి. భారత్‌కు అండగా ఉంటామని అమెరికా, రష్యా, ఇజ్రాయెల్ ప్రకటించాయి. ఇక సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ.. ఉగ్ర దాడి వార్త తెలుసుకున్న వెంటనే హుటాహుటినా భారత్‌కు బయల్దేరి వచ్చేశారు. బుధవారం అత్యవసర కేబినెట్ సమావేశానికి పిలుపునిచ్చారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. అలాగే మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించనున్నారు.
ఇది కూడా చదవండి: Terror Attack: ఆర్మీ యూనిఫాంలో ఉగ్రవాదులు.. అసలైన భారత సైనికులను చూసి భయపడ్డ బాధితులు (వీడియో)