Pahalgam terror attack: జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదులు దుశ్చర్యకు పాల్పడ్డారు. అనంత్‌నాగ్ జిల్లాలోని పహల్గామ్‌లోని పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు వచ్చిన టూరిస్టులపై కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో ఒకరు మరణించగా, 12 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దాడికి తామే పాల్పడినట్లు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రసంస్థ లష్కరే తోయిబాకు చెందిన అనుబంధ ఉగ్ర సంస్థ ‘‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్)’’ బాధ్యత ప్రకటించింది.
Read Also: Sunitha: ప్రవస్తిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ముద్దు చేశా.. మా గురించి చర్చించే స్థాయికి ఎదిగింది!
ఇదిలా ఉంటే, సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్రమోడీ ఈ టెర్రరిస్ట్ అటాక్‌పై ఆరా తీశారు. దాడి గురించిన వివరాలను జెడ్డాలో ఉన్న ప్రధానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలియజేశారు. సంఘటన స్థలాన్ని సందర్శించాల్సిందిగా అమిత్ షాని ప్రధాని మోడీ ఆదేశించారు. తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. మరోవైపు, జమ్మూ కాశ్మీర్ ఉన్నతాధికారులతో అమిత్ షా వర్చువల్‌గా ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. దాడికి పాల్పడిన వారిని విడిచే ప్రసక్తే లేదని జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ సిన్హా, సీఎం ఒమర్ అబ్దుల్లా అన్నారు.