ఈ ఉగ్రదాడిపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్, పాక్ తరుపున ఆడిన అతికొద్ది మంది హిందూ క్రికెటర్లలో ఒకరైన దానిష్ కనేరియా స్పందించారు. ‘‘పహల్గామ్ దాడిని క్రూరమైన దాడి’’గా ఖండించారు. ‘‘బంగ్లాదేశ్ నుంచి బెంగాల్, కాశ్మీర్ వరకు అదే మనస్తత్వం హిందువుల్ని లక్ష్యంగా చేసుకుంటుంది. కానీ ఈ లౌకికవాదులు, న్యాయవ్యవస్థ దాడి చేసిన వారిని అణిచివేయబడిన మైనారిటీగా ముద్రవేస్తోంది’’ అని ట్వీట్ చేశారు. బాధితులకు న్యాయం చేయాలని ఆయన ట్వీట్లో పేర్కొన్నారు. తన పోస్టులో భర్తను కోల్పోయిన మహిళ,…
Pahalgam terror attack: జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడి యావద్ దేశాన్ని షాక్‌కి గురిచేసింది. కాశ్మీర్ అందాలు చూసేందుకు వచ్చిన టూరిస్టుల్ని టార్గెట్ చేసి ఉగ్రవాదులు కాల్చి చంపారు. ప్రస్తుతం వస్తున్న వివరాల ప్రకారం, 27 మంది వరకు టూరిస్టులు ఈ దాడిలో మరణించినట్లు సమాచారం.
Pahalgam terror attack: జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో మంగళవారం ఉగ్రవాదులు టూరిస్టులను టార్గెట్ చేస్తూ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ దాడిలో ఇప్పటి వరకు ఒకరు మరణించగా, 12 మంది గాయపడినట్లు చెబుతున్నారు. అయితే, మరణాల సంఖ్య మరింత ఎక్కువగా ఉండొచ్చని తెలుస్తోంది. ఈ దాడిని ప్రధాని నరేంద్రమోడీ సహా అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ ఖండించారు. దాడికి పాల్పడినవారిని ఖచ్చితంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. ప్రధాని మోడీ…
Pahalgam terror attack: ఉగ్రవాదులు అదును చూసి ఘాతుకానికి పాల్పడ్డారు. కాశ్మీర్ అందాలు చూసేందుకు వచ్చిన టూరిస్టులను టార్గెట్ చేశారు. జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ బాధితులు వీడియోలు అందరి చేత కన్నీరు తెప్పిస్తున్నాయి. ఎంతో ఆనందంగా ముగియాల్సిన ట్రిప్, ఉగ్రవాదుల మూలంగా అంతా తారుమారైంది.
శ్రీనగర్ కు బయలుదేరి వెళ్తున్నారు అమిత్ షా. కాగా, శ్రీనగర్ వెళ్లిన తర్వాత అన్ని ఏజెన్సీలతో అత్యవసర భద్రతా సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు అమిత్ షా. కాగా, అంతకుముందు, పహల్గామ్లో పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడిని కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంతీవ్రంగా ఖండించారు. ఈ దారుణమైన ఉగ్రవాద చర్యలో పాల్గొన్న వారిని వదిలిపెట్టబోము హెచ్చరించారు. నేరస్థులను కఠినంగా శిక్షిస్తామన్నారు.
Pahalgam terror attack: జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడి యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. అధికారికంగా వస్తున్న సమాచారం ప్రకారం, ఇప్పటి వరకు ఒకరు మృతి చెందగా, 12 మంది గాయపడినట్లు తెలుస్తోంది. అయితే, అనధికారికంగా మృతుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుదనే వార్తలు వినిపిస్తున్నాయి.
Pahalgam terror attack: జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు దుశ్చర్యకు పాల్పడ్డారు. అనంత్‌నాగ్ జిల్లాలోని పహల్గామ్లోని పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు వచ్చిన టూరిస్టులపై కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో ఒకరు మరణించగా, 12 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దాడికి తామే పాల్పడినట్లు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రసంస్థ లష్కరే తోయిబాకు చెందిన అనుబంధ ఉగ్ర సంస్థ ‘‘ది రెసిస్టెంట్ ఫ్రంట్(టీఆర్ఎఫ్)’’ బాధ్యత ప్రకటించింది.
ఇంటర్ ఫలితాల్లో మొదటి స్థానంలో నిలిచిన జిల్లాలు ఇవే.. నేడు తెలంగాణలో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. ఇంటర్ బోర్డు కార్యాలయంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్ రెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఈ ఏడాది ఇంటర్ ఫస్టియర్, సెకండియర్‌తో కలిపి మొత్తం దాదాపు 9.97 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఫస్టియర్‌లో 66.89 శాతం, ద్వితీయ సంవత్సరంలో 71.37 శాతం…
ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు.. పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలపై చర్చించిన సీఎం చంద్రబాబు.. కేంద్ర హోంశాఖ మంత్రితో కీలక చర్చలు జరిపారు.. ప్రధానంగా రాజ్యసభ ఉప ఎన్నికలపై చర్చించినట్టుగా తెలుస్తోంది.. ఏపీ నుంచి ఖాళీ అయిన రాజ్యసభ స్ఖానాన్ని భర్తీ చేసే అంశంపై నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం.. విజయసాయి రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానం భర్తీపై ప్రధానంగా చర్చ జరిగినట్టుగా…
బ్యాంకాక్ లో మంచి ఉద్యోగం ఇప్పిస్తామని ఆశ చూపి మయన్మార్ కేంద్రంగా సైబర్ ఫ్రాడ్ కేఫ్ లో బందీలుగా మారి బలవంతంగా సైబర్ వెట్టిచాకిరికి గురవుతున్న తెలంగాణకు చెందిన యువతకు విముక్తి లభించింది. వీరిలో ముగ్గురు తెలంగాణకు చెందిన వారు కాగా, మరొకరు ఏపీకి చెందిన వ్యక్తి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదేశాల మేరకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రత్యేక చొరవ తీసుకుని వీరిని స్వదేశానికి రప్పించారు.