Pahalgam terror attack: ఉగ్రవాదులు అదును చూసి ఘాతుకానికి పాల్పడ్డారు. కాశ్మీర్ అందాలు చూసేందుకు వచ్చిన టూరిస్టులను టార్గెట్ చేశారు. జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ బాధితులు వీడియోలు అందరి చేత కన్నీరు తెప్పిస్తున్నాయి. ఎంతో ఆనందంగా ముగియాల్సిన ట్రిప్, ఉగ్రవాదుల మూలంగా అంతా తారుమారైంది. అప్పటి వరకు సంతోషంగా కాశ్మీర్ అందాలను, హిమాలయాలను, పచ్చటి చెట్లు, గడ్డి భూములు చూస్తున్న టూరిస్టులను చుట్టుముట్టి కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఇప్పటి వరకు ఒకరు మరణించినట్లు, 12 మంది గాయపడినట్లు అధికారిక సమాచారం. అయితే, మృతుల సంఖ్య మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దాడికి లష్కరే తోయిబా ప్రాక్సీ సంస్థ ‘‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’’ ఉగ్ర సంస్థ బాధ్యత ప్రకటించింది.
Read Also: GHMC : హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి
ప్రస్తుతం ఈ దాడికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. బాధిత టూరిస్టులు తమ వారిని కాపాడాలంటూ కన్నీటితో వేడుకుంటున్న దృశ్యాలు అందర్ని కలిచివేస్తున్నాయి. ‘‘ప్లీజ్ నా భర్తను రక్షించండి’’ అంటూ ఓ మహిళ ఏడుస్తూ వేడుకుంటున్న వీడియోలు సోషల్ మీడియాలో దర్శమిస్తున్నాయి. ఆర్మీ దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు, ఐడీ కార్డులు, పేర్లు అడిగి, ముస్లిం కాని వారిని టార్గెట్ చేసి కాల్చి చంపారు. హనీమూన్‌కి వచ్చిన ఓ కొత్త జంట ఈ దాడికి గురైంది. తన భర్తను దగ్గర నుంచి కాల్చి చంపినట్లు మహిళ షాక్‌లో వణుకుతున్న గొంతుతో చెప్పింది. భర్త శవం పక్కన కూర్చుని ఉన్న ఆ యువతి ఫోటో ఇప్పుడు అందరితో కన్నీరు తెప్పిస్తోంది.