నిరంతరం క్షిపణి పరీక్షలు, సైనిక సమీక్షలతో ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ క్షణం తీరిక లేకుండా సమయం గడుపుతున్నారు. అమెరికా, దక్షిణ కొరియాతో ఉద్రిక్తతలు కొనసాగుతుండగా.. నాలుగు రోజుల కిందట ఆయుధ ఫ్యాక్టరీల్లోని ఆధునాతన తుఫాకులు సహా పలు ఆయుధాలను కిమ్ జోంగ్ పరిశీలించారు. తాజాగా, ఉత్తర కొరియా సైనిక జనరల్‌ను ఆయన తొలగించారు. అంతేకాదు, యుద్ధం వచ్చే ఛాన్స్ ఉందని, ఇందుకు రెడీ కావాలని సూచించినట్టు ఉత్తర కొరియా అధికారిక మీడియా తెలిపింది.
Read Also: Jailer Movie Twitter Review : తలైవా కమ్ బ్యాక్ …. రూ.1000కోట్లు పక్కా మావ
సెంట్రల్ మిలిటరీ కమిషన్ మీటింగ్ లో ఉత్తర కొరియా శత్రువులను ఎదుర్కొనేందుకు ప్రణాళికలపై కిమ్ జోంగ్ చర్చించినట్లు తెలుస్తోంది. మిలిటరీ టాప్ జనరల్, జనరల్ స్టాఫ్ చీఫ్ పాక్ సు ఇల్ స్థానంలో రక్షణ మంత్రి జనరల్ రి యోంగ్ గిల్‌కు బాధ్యతలు అప్పగించినట్లు ఓ నివేదిక తెలిపింది. దీంతో రక్షణ మంత్రిగా రీ కొనసాగుతారా? లేదా ఇంకా క్లారిటీ రాలేదు. గత కొన్ని రోజులుగా కిమ్ జోంగ్ ఉన్ కూడా ఆయుధాల ఉత్పత్తి సామర్థ్యాన్ని విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే, గత వారంలో మూడు రోజుల పాటు ఆయుధ కర్మాగారాలను కిమ్ సందర్శించారు.. మరిన్ని క్షిపణులు, మానవరహిత గగనతల వాహనాలు, ఇతర ఆయుధాలను తయారు చేయాలని పిలుపునిచ్చారు.
Read Also: HYD Metro: మెట్రో స్టేషన్ల కిందే సిట్టింగ్.. అడ్డంగా బుక్కైన మందుబాబులు
దక్షి కొరియా రాజధాని సియోల్, దాని పరిసర ప్రాంతాలపై కిమ్ జోంగ్ ఉన్ చూస్తున్న ఫోటోలను కేసీఎన్ఏ విడుదల చేసింది. ఉక్రెయిన్‌పై దండయాత్ర కొనసాగిస్తోన్న రష్యాకు ఉత్తర కొరియా ఆయుధాలు ఎగుమతి చేస్తుందని అగ్రదేశం అమెరికా ఆరోపణలు చేసింది. అయితే, అమెరికా చేసిన వ్యాఖ్యలను రష్యా, ఉత్తర కొరియా ఖండించాయి. సైనిక దళాలను యుద్దానికి సిద్ధం చేయాలని.. వారికి అత్యాధునిక ఆయుధాలు, యుద్ధ సామాగ్రితో మాక్ డ్రిల్స్ నిర్వహించాలని ఉత్తర కొరియా అధ్యక్షుడు పిలుపునిచ్చినట్లు సమాచారం.
Read Also: Varshini : ఆ దర్శకుడు నా తో అసభ్యంగా ప్రవర్తించాడు
కొరియన్ రిపబ్లిక్ 75వ వార్షికోత్సవం సందర్భంగా సెప్టెంబరు 1న ఉత్తర కొరియా మిలీషియా పరేడ్ జరుగనుంది. దీనికి ముందు ఆగస్టు 21 నుంచి 24 వరకూ అమెరికా, దక్షిణ కొరియా సంయుక్త సైనిక విన్యాసాలు జరుగుతాయి. వీటిని ఉత్తర కొరియా తమ భద్రతకు ముప్పుగా భావిస్తోంది. దీంతో మరోసారి కొరియా ద్వీపకల్పంలో యుద్ధ వాతావరణం నెలకొంది.