తూర్పు అమెరికా రాష్ట్రాలను తుఫాను వణికిస్తుంది. భీకర గాలులు, వడగండ్లతో కూడిన భారీ వర్షం కురుస్తుంది. ఇప్పటికే ప్రమాద ఘటనల్లో ఇద్దరు మరణించారు. ఇప్పటికే వందల విమానాలను రద్దు చేశారు. వేలాది విమానాలు లేట్ గా నడుస్తున్నాయి. 11 లక్షలకు పైగా ఇళ్లు, వాణిజ్య కార్యాలయాలకు విద్యుత్తు సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. న్యూయార్క్ నుంచి టెన్నెసీ వరకు దాదాపు 10 రాష్ర్టాల్లో పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. 2.95 కోట్ల మంది టోర్నడోల ముప్పు ఎదుర్కొంటున్నారని వాతావరణ అధికారులు తెలిపారు.
Read Also: AP Govt: నేడే కల్యాణ మస్తు, షాదీ తోఫా డబ్బులు నేరుగా అకౌంట్లోకి
అత్యంత బలమైన గాలులతో తుఫాన్లు, టోర్నడోలు విరుచుకుపడే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రజలు ఇంటి నుంచి బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ చేసింది. అలబామా, జార్జియా, దక్షిణ కరోలినా, ఉత్తర కరోలినా, మేరీల్యాండ్, డెలావర్, న్యూజెర్సీ, పెన్సిల్వేనియా, టెన్నెసీ, వెస్ట్ వర్జీనియా, వర్జీనియాలో 11 లక్షల ఇళ్లకు కరెంట్ సరఫరా నిలిచిపోయినట్లు అధికారులు చెప్పారు.
Read Also: World Cup 2023: ప్రపంచకప్ 2023కి భారత్ జట్టు ఇదే.. రాహుల్, అయ్యర్ ఎంట్రీ! మరో అనూహ్య ఎంపిక
అయితే, ఆయా ప్రాంతంలోని విద్యుత్ లైన్లను మరమ్మతు చేసేందుకు కొన్ని రోజుల సమయం పట్టవచ్చని నాక్స్‌విల్లె యుటిలిటీ బోర్డ్ వెల్లడించింది. ఇక, భారీ వర్షాలు, గంటకు 70 మైళ్ల వేగంతో బలమైన గాలులు వీస్తుండటంతో విమాన, రోడ్డు రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. ఇప్పటికే వందలాదిగా ఇళ్ల పైకప్పులు ధ్వంసమయ్యాయి.. చెట్లు కూలి రోడ్లు, నివాసాలపై పడిపోయాయని అధికారులు పేర్కొన్నారు. డ్యూటీలకు వెళ్లిన ఉద్యోగులను తుఫాను కారణంగా ముందుగానే ఇళ్లకు చేరుకోవాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇటీవలి కాలంలో ఇంతటి తీవ్ర తుఫాను ఇదేనంటూ జాతీయ వాతావరణ విభాగం తెలిపింది.