Hyderabad Woman: యూఎస్‌లో ఆకలితో తెలంగాణ యువతి.. విదేశాంగ మంత్రికి లేఖ రాసిన తల్లి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Woman: మాస్టర్స్ డిగ్రీ చదివేందుకు అమెరికాకు వెళ్లిన హైదరాబాద్ మహిళ సయ్యదా లులు మిన్హాజ్ జైదీ చికాగో రోడ్లపై మానసిక ఒత్తిడితో పోరాడుతూ, తన వస్తువులు చోరీకి గురై ఆకలితో అలమటిస్తున్నారు. సయ్యదా తల్లి సయ్యదా వహాజ్ ఫాతిమా విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌కు లేఖ రాస్తూ జోక్యం చేసుకుని తన కుమార్తెను భారత్‌కు తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. భారత రాష్ట్ర సమితి నాయకుడు ఖలీకర్ రెహమాన్ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేసిన తర్వాత ఈ లేఖ సోషల్ మీడియాలో కనిపించింది.
Also Read: Black Tamota : బ్లాక్ టమోటా గురించి ఎప్పుడైనా విన్నారా?ఎన్ని లాభాలో..
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
లేఖలో సయ్యదా తల్లి తన కుమార్తె యొక్క కష్టాలను ఇలా వివరించింది. “తెలంగాణలోని మౌలాలీ నివాసి అయిన నా కుమార్తె సయ్యదా లులు మిన్హాజ్ జైదీ ఆగస్టు 2021లో డెట్రాయిట్‌లోని ఓ విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ చదివేందుకు వెళ్లింది. అక్కడికి వెళ్లిన తర్వాత మాతో తరచుగా టచ్‌లో ఉండేది. కానీ, గత రెండు నెలలుగా ఆమె నాతో టచ్‌లో ఉండడం లేదని, నా కూతురు డిప్రెషన్‌లో ఉందని, ఆమె సామాన్లు ఎవరో దొంగిలించారని, దీంతో ఆమె ఆకలితో అలమటిస్తోందని ఇద్దరు హైదరాబాద్ యువకుల ద్వారా మాకు తెలిసింది. అమెరికాలోని చికాగో రోడ్లపై నా కూతురు కనిపించిందని చెప్పారు. దయచేసి కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ జోక్యం చేసుకుని నా కూతురిని భారత్‌కు రప్పించాలి.” అని సయ్యదా తల్లి విజ్ఞప్తి చేసింది.
వాషింగ్టన్ డీసీలోని భారత రాయబార కార్యాలయం, చికాగోలోని భారత కాన్సులేట్ జోక్యం చేసుకుని తన కుమార్తెను తిరిగి తీసుకురావాలని అభ్యర్థిస్తోంది. మహ్మద్ మిన్హాజ్ అఖ్తర్ సహాయంతో తన కుమార్తెను గుర్తించవచ్చని ఆమె పంచుకున్నారు.
https://twitter.com/Khaleeqrahman/status/1684087461863997440
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!