అమెరికా నేవీకి నూతన అధిపతిగా లీసా ఫ్రాంచెట్టి పేరు తెరపైకి వచ్చింది. దేశ అధ్యక్షుడు జో బైడెన్ ఆ పేరును ప్రతిపాదించారు. ఒకవేళ యూఎస్ సెనేట్ ఆ ప్రతిపాదనను సమర్ధిస్తే అడ్మిరల్ లీసా ఫ్రాంచెట్టి అమెరికా నావికా దళాధిపతిగా బాధ్యతలు స్వీకరించనుంది. ఆ తర్వాత అమెరికా నేవీలో మొట్టమొదటి మహిళగా చరిత్ర సృష్టించనున్నారు. అందుకు సంబంధించి బైడెన్ ప్రతిపాదన అయితే చేశారు కానీ.. యూఎస్ సెనేట్ ఆమోదం తప్పనిసరి. అధికార యంత్రాంగాన్ని నియమించడంలో అమెరికా కాంగ్రెస్ కు భారత పార్లమెంటు కంటే విశేష అధికారాలుంటాయి. కాకపొతే ఈ ప్రతిపాదనకు రిపబ్లికన్లు కూడా మద్దతు తెలపాల్సి ఉంటుంది.
Audimulapu Suresh: సీఎం జగన్ సంకల్పం ముందు.. దుష్టశక్తుల పన్నాగాలు నిలవలేదు
మరోవైపు జో బైడెన్ మాట్లాడుతూ.. లీసా ఫ్రాంచెట్టి గత 38 సంవత్సరాలుగా ఆమె స్వీకరించిన ప్రతి పదవికి తగిన న్యాయం చేశారని.. అమెరికా నావికా దళానికి అత్యుత్తమ సేవలందించారని కొనియాడారు. ప్రస్తుతం లీసా.. అమెరికా నావికా దళానికి వైస్ చీఫ్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆమే అమెరికా నౌకాదళంలో ఫోర్ స్టార్ అడ్మిరల్ గా నియమింపబడిన రెండో అధికారిగా ఉంది.
Samuthirakani: దానివల్లే త్రివిక్రమ్ నాకు సపోర్ట్ చేశాడు.. లేకపోతే!
లీసా ఫ్రాంచెట్టి నియామకంపై సెనెట్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. అమెరికా నేవీకి చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన మొట్టమొదటి మహిళగా నిలుస్తారు. రిపబ్లికన్లకు అమెరికా నౌకా దళం పేరు ప్రఖ్యాతలు గురించి, దాని సామర్ధ్యం గురించి పరిజ్ఞానం ఉందనే అనుకుంటున్నట్లు బైడెన్ తెలిపారు. అయితే దేశఖ్యాతిని మరింతగా పెంచే విధంగా తొలి మహిళా అడ్మిరల్ నిర్ణయాన్ని వారు ఆమోదిస్తారని బైడెన్ తెలిపారు.