America Heavy Rains: అమెరికాలో వర్ష బీభత్సం.. వేల విమానాలు రద్దు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
America Heavy Rains: ఈమధ్య కాలంలో వాతావరణంలో పెను మార్పుల కారణంగా ప్రపంచంలోని చాలా దేశాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మొన్నటి వరకు ఇండియాలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిశాయి. భారీవర్షాలతో వరదలు ఆయా రాష్ట్రాల్లోని ప్రజా జీవనాన్ని అతలా కుతలం చేశాయి. ఇప్పటికీ వరదల నుంచి ప్రజలు పూర్తిస్థాయిలో కోలుకోలేదు. ఇక చైనాలో సైతం టోర్నడోలు వర్షాలతో దేశాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఇప్పటికీ దేశ రాజధాని బీజింగ్‌లో వరదలు కొనసాగుతున్నాయి. ఇంకా వరదల్లోనే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇపుడు అగ్ర రాజ్యమైన అమెరికాలోనూ తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. అమెరికాలో భారీ తుఫాన్ మూలంగా దేశ వ్యాప్తంగా వేలాది విమానాలను రద్దు చేశారు. భీకర గాలులు, ఉరుములతో కూడిన వర్షంతోపాటు.. వడగళ్లతో అగ్రరాజ్యం వణుకుతోంది.
Read also: Meher Ramesh: కొంప ముంచిన ‘క్రింజ్’ కామెంట్లు.. దెబ్బకి దిగొచ్చిన మెహర్ రమేష్
Also Read
- flydubai Incident: ఫ్లై దుబాయ్ విమానాన్ని కాపాడిన భారత పైలట్.. 9/11 తరహా ప్రమాదం తప్పించిన హీరో!
- El Nino Effect: ఎల్ నినో ఎఫెక్ట్.. ఎడారిలో విరగబూసిన పూలు!
- Flydubai Flight: ఫ్లై దుబాయ్ విమానం హైజాక్ కలకలం.. ఇజ్రాయెల్ రంగంలోకి దిగడంతో..!
- US-Iran Conflict: అమెరికా-ఇరాన్ చర్చలు ఫెయిల్.. ఖతార్ రాయబారం విఫలం, మళ్లీ యుద్ధ మేఘాలు!
తుఫాన్ ధాటికి ఉత్తర అమెరికా అతలాకుతలమైంది. తుపాను మూలంగా ఇద్దరు ప్రాణాలు కోల్పోయినట్లు అమెరికా అధికారులు ప్రకటించారు. దేశంలో నెలకొన్న ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో వేలాది విమానాలను రద్దు చేశారు. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో లక్షలాది మంది ప్రజలు చీకట్లో ఉన్నారు. తుపాను కారణంగా వాషింగ్టన్ డీసీ (Washington D.C)లో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలను ముందుగానే మూసివేశారు. టేనస్సీ నుంచి న్యూయార్క్ వరకు దాదాపు 10 రాష్ట్రాలు ఈదురు గాలుల్లో చిక్కుకున్నాయి. సుమారు 29.5 మిలియన్లకు పైగా ప్రజలు ఈ తుపానుకు ప్రభావితులైనట్లు అమెరికా వెదర్ సర్వీస్ ప్రకటించింది. న్యూయార్క్, వాషింగ్టన్, ఫిలడెల్ఫియా, అట్లాంటా విమానాశ్రయాల్లో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఫ్లైట్ ట్రాకింగ్ సర్వీస్ ఫ్లైట్ అవేర్ ప్రకారం.. సోమవారం రాత్రి నాటికి 2,600 కంటే ఎక్కువ యూఎస్ విమానాలు రద్దయినట్టు తెలుస్తోంది. 7,900 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. మేరీల్యాండ్, వర్జీనియా సహా దక్షిణ, మధ్య అట్లాంటిక్ రాష్ట్రాల్లో సుమారు 11 లక్షల ఇళ్లతోపాటు వాణిజ్య సముదాయాలకు కరెంట్ సరఫరా ఆగిపోయింది. అమెరికాలో కొనసాగుతున్న భీకర తుఫాను మూలంగాణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లోని ప్రజలకు తిండికి సైతం ఇబ్బందులు పడుతున్నట్టు వార్త కథనాలు చెబుతున్నాయి.
తాజావార్తలు
-
Ind Vs WI: శివాలెత్తిన వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్స్.. భారత్ ముందు భారీ లక్ష్యం.. మూడు సెంచరీలు నమోదు..
-
Chanakya Neeti: జీవితాన్ని గెలవాలంటే ఇది తెలుసుకోండి! చాణక్యుడి సీక్రెట్ రూల్..
-
Meerut Blue Drum Murder: మీరట్ డ్రమ్ మర్డర్ కేసు.. ముస్కాన్-సాహిల్ దోషులుగా నిర్ధారణ.!
-
CM Chandrababu: ‘కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకుంది’.. ఇళ్ల స్థలాల పట్టాలు అందజేసిన సీఎం..
-
Employees Bonus: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండుగ గిఫ్ట్.. ఖాతాల్లోకి ఆ రోజే బోనస్ డబ్బులు!
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!