Dog shocks bride groom: పెళ్లి కొడుకుకు షాక్ ఇచ్చిన కుక్క.. ఎంతపని చేసిందంటే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dog shocks bride groom: పెంపుడు జంతువులు చాలా సార్లు ఎంత నవ్వించే పనులు చేస్తాయో కొన్ని కొన్ని సార్లు ఏడిపిస్తూ ఉంటాయి కూడా. అవి చేసే పనులకు ఏం చేయాలో తెలియక తల పట్టుకొని కూర్చోవడం మనవంతు అవుతుంది. ప్రేమగా పెంచుకుంటున్న పెంపుడు జంతువులే కొన్ని సార్లు మన ముఖ్యమైన పనులకు అడ్డంకిగా మారితే ఆ బాధ వర్ణనాతీతం. అలాంటి ఘటనే అమెరికాలోని ఓ యువకుడికి ఎదురయ్యింది. ఈ స్టోరీ తెలుసుకున్న వారు ఇఫ్పుడు ఆ వ్యక్తిపై జాలి చూపిస్తున్నారు. అసలేం జరిగిందంటే పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో మర్చిపోలేని మధురానుభూతి. తమ పెళ్లి జీవితాంతం గుర్తుండేలా ఆరోజు డిఫరెంట్ గా ఘనంగా చేసుకోవాలని అందరు భావిస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు చాలా మంది డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేసుకుంటున్నారు. తమకు నచ్చిన ప్రదేశానికో, దేశానికో వెళ్లి పెళ్లి చేసుకుంటున్నారు. దాని కోసం ఎంత ఖర్చు చేయడానికి కూడా వెనుకాడటం లేదు. ఇక అలాగే తమ పెళ్లి కోసం డెస్టినేషన్ వెడ్డింగ్ ను ప్లాన్ చేసుకుంది ఓ జంట. అమెరికాకు చెందిన ఓ జంట తమ పెళ్లి అంగరంగ వైభవంగా చేసుకోవాలని నిర్ణయించుకుంది.
Also Read: Chandrayaan 2 mission Mistakes : చంద్రయాన్-2 లో జరిగిన తప్పులు చంద్రయాన్-3లో జరిగే అవకాశం ఉన్నాయా?
Also Read
- Saudi-Houthis: దాడులు తీవ్రం చేసిన హౌతీలు.. అప్రమత్తంగా ఉండాలని పౌరులకు సౌదీ హెచ్చరిక
- Rahul Gandhi: యూపీఐ ఛార్జీలపై రాహుల్‌గాంధీ విమర్శలు
- IND vs WI 2026: మూడు వన్డేలు, 5 టీ20 మ్యాచ్‌ల షెడ్యూల్ విడుదల.. సెప్టెంబర్ 27 నుంచే..
- Faaah : 'ఫాహ్..' వైరల్ సౌండ్ వెనుక ఉన్నది టాలీవుడ్ లెజెండరీ కమెడియనా?.. అసలు నిజం ఇదిగో!
అమెరికాకు చెందిన డొనాటో ఫ్రాట్టరోలి, మగ్దా మజ్రీకి ఇటీవలే పెళ్లి కుదిరింది. వారి పెళ్లి ఆగస్టు 31న జరిపించాలని నిర్ణయించారు. దీని కోసం ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసుకున్నారు. ఇక శుక్రవారం పెళ్లి బృందం ఇటలీ బయలుదేరేందుకు ఫ్లైట్ టికెట్లు కూడా బుక్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో గురువారం డొనాటో, మగ్దాలు పెళ్లికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తి చేసేందుకు సిటీ హాల్ కు వెళ్లారు. ఎంతో ఆనందంతో అక్కడి నుంచి ఇంటికి తిరిగొచ్చిన వారికి డొనాటో పెంపుడు కుక్క చిక్కీ షాకిచ్చింది.
వారు ఇంటికి చేరుకునే సమయానికి చిక్కీ పాస్ పోర్ట్ నములుతూ కనిపించింది. ఇది చూడగానే డొనాటోకు గుండె ఆగినంత పనైయ్యింది. వెంటనే కుక్క నోటిలో నుంచి ఆ పాస్ట్ పోర్ట్ ను లాక్కొని చూడగా అప్పటికే సగం పేజీను పరపరా నమిలేసింది చిక్కీ. ఇక ఇటలీ బయలు దేరే వారం రోజుల ముందు ఇలా జరగ్గా ఏం చేయాలో తెలియక వారు తలపట్టుకున్నారు. తరువాత బంధువులు, స్నేహితులు ఇచ్చిన సలహాతో స్థానిక అధికారులను కలిసి తన గోడు వెళ్లబోసుకున్నాడు డొనాటో. అతని బాధను అర్థం చేసుకున్న అధికారులు వీలైనంత త్వరగా కొత్త పాస్ పోర్ట్ జారీ చేసే ప్రయత్నం చేస్తామని భరోసా ఇచ్చారు. దీంతో డొనాటో కొంత ఊపిరి పీల్చుకున్నారు. ఇక టికెట్స్ బుక్ చేసుకున్న ప్రకారం పెళ్లి బృందం శుక్రవారం ఇటలీకి బయలుదేరనుంది. ఆ లోపు కొత్త పాస్ పోర్ట్ వస్తే వారితో కలిసి ఫ్లైట్ ఎక్కుతానని డొనాటో తెలిపాడు. లేనిపక్షంలో ఇటలీ నుంచి తిరిగొచ్చిన వారికి స్వాగతం చెప్పేందుకు ఎయిర్ పోర్టుకు వెళ్తానని పెళ్లికొడుకు డినాటో అంటున్నాడు. అయితే తెలివిలేని మూగజీవి చేసిన తప్పుకు డొనాటో పెళ్లి కోరిక తీరకుండా పోకూడదని అతనికి వెంటనే పాస్ పోర్టు రావాలని ఈ వార్త తెలిసిన వారు కోరుకుంటున్నారు.
తాజావార్తలు
-
Saudi-Houthis: దాడులు తీవ్రం చేసిన హౌతీలు.. అప్రమత్తంగా ఉండాలని పౌరులకు సౌదీ హెచ్చరిక
-
Ramayana : ‘జై జై రామ్’ పాట.. ఎందుకిలా చేస్తున్నారు?
-
418: కంటెంట్ చూసి షాక్.. రాత్రికి రాత్రే ‘పాన్-ఇండియా’ రేంజ్‌కు మారిన ‘418’ రిలీజ్!
-
Rahul Gandhi: యూపీఐ ఛార్జీలపై రాహుల్‌గాంధీ విమర్శలు
-
IND vs WI 2026: మూడు వన్డేలు, 5 టీ20 మ్యాచ్‌ల షెడ్యూల్ విడుదల.. సెప్టెంబర్ 27 నుంచే..
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?