Wildfire: హవాయి దాటి వాషింగ్టన్ వైపు కార్చిచ్చు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Wildfire: హవాయి దీవులను పూర్తిగా దహించి వేసిన కార్చిచ్చు.. వేగంగా వాషింగ్టన్ వైపు కదులుతోంది. వేగంగా వీస్లున్న బలమైన గాలుల కారణంగా కార్చిచ్చు కూడా అంతే వేగంతో వ్యాపిస్తోంది. వేగంగా వ్యాపిస్తున్న కార్చిచ్చు కెనడా, అమెరికా దేశాలను వణికిస్తోంది. కార్చిచ్చు ఉత్తర అమెరికా దేశాలను వణికిస్తోంది. బలమైన గాలుల కారణంగా వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే హవాయి ద్వీపంలో బీభత్సం సృష్టించిన ఈ కార్చిచ్చు.. ఇప్పుడు వాషింగ్టన్‌రాష్ట్రం వైపు దూసుకొస్తోంది. కార్చి్చ్చు వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో వెంటనే ఖాళీ చేయాలని పలు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. వాషింగ్టన్‌లోని స్పోకాన్ కౌంటీ సమీపంలో మొదలైన ఈ కార్చిచ్చు కొన్ని గంటల వ్యవధిలోనే 500 నుంచి 3 వేల ఎకరాలకు విస్తరించిందని.. బలమైన గాలులే అందుకు కారణమని వాషింగ్టన్ స్టేట్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ నేచురల్ రిసోర్సెస్ ప్రకటించింది. కార్చి్చ్చుతో ఇప్పటికే కొన్ని ఇళ్లు కాలిపోయి ఆస్తినష్టం కూడా సంభవించినట్లు అధికారులు తెలిపారు. కార్చిచ్చు మూలంగా కౌంటీలోని మెడికల్ లేక్ పట్టణ ప్రజలకు లెవెల్ 3 అలర్ట్ జారీ అయింది. వెంటనే ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అలర్ట్ ఉద్దేశమని అధికారులు స్పష్టం చేశారు.
Read also: Kartikeya : చిరంజీవి గారి పై విమర్శలు చేసే వారిది చిన్న మనస్తత్వం..
Also Read
- Ukraine War: రష్యాపై ఉక్రెయిన్ అతిపెద్ద దాడి.. 1000కి పైగా డ్రోన్లతో కల్లోలం..
- Global Fuel Crisis: అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్‌లో రికార్డ్ స్థాయికి చేరిన డీజిల్, పెట్రోల్ ధరలు.. నెక్ట్స్ భారత్ వంతేనా?
- PIA Uniform Makeover: పాకిస్థాన్ ఎయిర్‌లైన్స్‌పై ట్రోలింగ్.. కొత్త యూనిఫామ్‌పై నెటిజన్ల ప్రశ్నలు..
- Iran-US Talks: అమెరికాతో చర్చలకు ఇరాన్ 7 షరతులు.. ట్రంప్ తిరస్కరిస్తే నిర్ణాయక యుద్ధానికి సిద్ధమంటూ హెచ్చరిక
కార్చిచ్చు వేగంగా వ్యాపిస్తుండటంతో మెడికల్ లేక్‌లోని ఓ ఆసుపత్రిలో వైద్యులు, రోగులను తరలించేందుకు ప్రభుత్వం నేషనల్ గార్డ్ ట్రూప్స్‌ను రంగంలోకి దింపింది. ఫోర్ లేక్స్ పట్టణానికి కూడా లెవెల్ 3 ఆదేశాలు జారీ అయ్యాయి. అలాగే స్పోకాన్ కౌంటీలోని 13 వేలమంది ప్రజలున్న చెనెయ్ నగరానికి సురక్షిత ప్రాంతానికి తరలి వెళ్లడానికి సిద్ధంగా ఉండాలని లెవెల్ 2 అలర్ట్ జారీ చేశారు. భారీగా నమోదైన ఉష్ణోగ్రతలతోపాటు వర్షాభావ పరిస్థితులు.. బలమైన గాలులు అగ్నికీలల వ్యాప్తికి కారణమవుతాయని జాతీయ వాతావరణ విభాగం తెలిపింది. కెనడాలో అత్యంత వేగంగా వ్యాపిస్తున్న కార్చిచ్చులు వేలాది మంది ఇతర ప్రాంతాలకు తరలిపోయేట్లు చేస్తున్నాయి. ఈ దేశంలోని నార్త్‌వెస్ట్ టెరిటరీస్‌లో 200పైగా కార్చిచ్చులు రాజుకున్నాయి. నార్త్ వెస్ట్ టెరిటరీస్ రాజధాని ఎల్లోనైఫ్‌లోని 20 వేల మంది ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. శుక్రవారం సాయంత్రం నాటికి 48 గంటల్లో 19 వేల మంది నగరాన్ని ఖాళీ చేయించారు.
- Tags
- america
- Flow
- hawaii
- Washington
- Wildfire
తాజావార్తలు
-
Sahil Chauhan: 27 బంతుల్లో సెంచరీ.. టీ20 క్రికెట్లో ప్రపంచ రికార్డు.. అతడికి ఇండియాతో సంబంధం ఏంటి..?
-
Ravi Teja: హిట్టు పడగానే రేటు పెంచేసిన మాస్ రాజా.. నిర్మాత డ్రాప్.. సంక్రాంతి సినిమా క్యాన్సల్ ?
-
వరంగల్ MGMలో ఒక్కసారిగా కుప్పకూలిన సీలింగ్.. ముగ్గురికి గాయాలు!
-
Hamid Ansari row: ‘‘ దేశానికి హిందువులు ముప్పా.?’’.. హమీద్ అన్సారీ వ్యాఖ్యలపై దుమారం..
-
Vedant Madhavan: ప్రౌడ్ ఫాదర్ మూమెంట్.. ఏషియన్ గేమ్స్ బరిలో మాధవన్ కుమారుడు!
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!