North Korea: కిమ్ పర్యవేక్షణలో క్రూయిజ్ క్షిపణిని పరీక్షించిన ఉత్తర కొరియా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
North Korea: కొరియా ద్వీపకల్పంలో వాతావరణం కాస్త ఉద్రిక్తంగా మారింది. ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్-ఉన్ వ్యూహాత్మక క్రూయిజ్ క్షిపణి ప్రయోగాత్మక పరీక్షను పర్యవేక్షించారు. ఈ మేరకు సోమవారం ప్రభుత్వ మీడియా వెల్లడించింది. అదే సమయంలో యూఎస్, దక్షిణ కొరియా సైన్యాలు తమ వార్షిక సైనిక వ్యాయామాన్ని ప్రారంభించాయి. ఇది దాడికి రిహార్సల్‌గా ఉత్తర కొరియా భావిస్తున్నట్లు తెలుస్తోంది. అమెరికా, దక్షిణ కొరియా, జపాన్‌ల అధినేతలు తమ తొలి త్రైపాక్షిక శిఖరాగ్ర సమావేశం జరిగిన మూడు రోజుల తర్వాత ఉత్తర కొరియా క్షిపణి పరీక్షల గురించి వార్తలు వచ్చాయి.
Read Also: Sonia Gandhi: రాజీవ్ గాంధీ జీవితం దారుణంగా ముగిసింది.. తక్కువ సమయంలో ఎన్నో మైలు రాళ్లను సాధించారు
Also Read
- IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
- Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
- Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
- Pakistan: ఒకవైపు ఇమ్రాన్ ఖాన్‌కు వైద్య పరీక్షలు.. మరోవైపు సోదరి అలీమా అరెస్ట్
శిఖరాగ్ర సమావేశంలో ఉత్తర కొరియా నుంచి పెరుగుతున్న అణు, క్షిపణి బెదిరింపులను ఎదుర్కోవడానికి బాలిస్టిక్ క్షిపణి రక్షణపై సహకారాన్ని పెంచుకోవాలని మూడు దేశాలు అంగీకరించాయి. ఉత్తర కొరియా నాయకుడు కిమ్ జోంగ్ ఉన్ నౌకాదళ విభాగాన్ని సందర్శించి వ్యూహాత్మక క్రూయిజ్ క్షిపణి పరీక్షను పర్యవేక్షించినట్లు రాష్ట్ర మీడియా సోమవారం నివేదించింది. జపాన్ సముద్రం అని కూడా పిలవబడే తూర్పు సముద్రంలో కిమ్ తన నౌకాదళంలో యుద్ధనౌకను ఒకదానిని పరిశీలించారు. వ్యూహాత్మక క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించే డ్రిల్‌ను ప్రదర్శించడాన్ని వీక్షించారు.
Read Also: EPFO: జూన్‌లో ఈపీఎఫ్‌వోలో చేరిన 17.89 లక్షల మంది సభ్యులు..
కేసీఎన్‌ఏ ప్రకారం, క్షిపణులు ఉద్దేశించిన లక్ష్యాలను లోపం లేకుండా చేధించాయి. ఉత్తర కొరియా నావికాదళం కోసం మరింత శక్తివంతమైన యుద్ధనౌకలను తయారు చేసేందుకు, షిప్‌బోర్డ్, నీటి అడుగున ఆయుధ వ్యవస్థలను ఆధునీకరించే ప్రయత్నాలను ప్రోత్సహిస్తానని కిమ్ చెప్పారు. క్రూయిజ్ క్షిపణి పరీక్షలపై ఉత్తర కొరియా చేసిన నివేదికలు వాస్తవాలకు అనుగుణంగా లేవని దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ ఒక ప్రకటనలో తెలిపారు.2022 సంవత్సరం ప్రారంభం నుంచి ఉత్తర కొరియా 100 కంటే ఎక్కువ ఆయుధ పరీక్షలను నిర్వహించింది. వీటిలో కొన్ని యూఎస్ ప్రధాన భూభాగం, దాని మిత్రదేశాలైన దక్షిణ కొరియా, జపాన్‌లపై దాడి చేయడానికి రూపొందించిన అణు క్షిపణులు ఉన్నాయి. యూఎస్, దక్షిణ కొరియా ప్రతిస్పందనగా వారి సాధారణ శిక్షణా వ్యాయామాలను విస్తరించాయి.
తాజావార్తలు
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
-
Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
-
Pakistan: ఒకవైపు ఇమ్రాన్ ఖాన్‌కు వైద్య పరీక్షలు.. మరోవైపు సోదరి అలీమా అరెస్ట్
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!