Donald Trump Arrest: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అరెస్ట్.. 20 నిమిషాల పాటు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Former America President Donald Trump Arrested: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అరెస్టు అయ్యారు. 2020 నాటి అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి ఫలితాల్లో జోక్యం, కుట్ర, అక్రమాలు లాంటి డజనుకు పైగా క్రిమినల్ కేసులు నమోదైన నేపథ్యంలో పోలీసుల ముందు ట్రంప్ లొంగిపోయారు. అట్లాంటా ఫుల్టన్ కౌంటీ జైలు వద్ద గురువారం పోలీసుల ఎదుట ఆయన లొంగిపోయారు. ఇందుకు సంబందించిన మగ్ షాట్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ఫుల్టన్ కౌంటీ జైలుకు వెళ్లి లొంగిపోవడంతో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. జైలులో 20 నిమిషాల పాటు గడిపారు. ఆపై రెండు లక్షల డాలర్ల విలువైన బాండ్‌ను సమర్పించి బెయిల్‌పై విడుదల అయ్యారు. ట్రంప్‌పై నమోదైన నాలుగు క్రిమినల్ కేసుల్లో ఇది ఒకటి. ఇలాంటి కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు స్వయంగా పోలీసులు ఎదుట లొంగిపోయినా.. దాన్ని అరెస్ట్ కిందే పరిగణిస్తారు.
Also Read
- Poland: పోలాండ్ పాఠశాలలో దుండగుడు కత్తితో వీరంగం.. ఏడుగురికి గాయాలు
- Humayun Kabir: ‘‘బాబ్రీ మసీదు ఎమ్మెల్యే, ఇప్పుడు రాజకీయాలకు గుడ్ బై’’.. హుమాయున్ కబీర్ కన్నీరు!
- Delhi: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. కూలిన మూడు అంతస్తుల బిల్డింగ్
- SIR Protest: ఢిల్లీలో ఉద్రిక్తత.. జంతర్ మంతర్ వద్ద నిరసనకు రాహుల్ గాంధీ, విపక్షాలు సిద్ధం!
స్థానిక కాలమానం ప్రకారం.. గురువారం రాత్రి 7 గంటలకు డొనాల్డ్ ట్రంప్ ఆట్లాంటాకు వెళ్లారు. అరెస్ట్, విడుదలకు సంబంధించిన ప్రక్రియ 20 నిమిషాల్లోనే ముగిసింది. జైలు అధికారులు ఆయనకు సంబంధించి వివరాలు తీసుకున్నారు. 77 ఏళ్ల ట్రంప్.. 6 ఫీట్ 3 ఇంచ్‌ల హైట్, 215 పౌండ్ల బరువు ఉన్నట్లు రికార్డుల్లో నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా జైలు అధికారులు ఆయనను ఫొటోలు దింపారు. నాలుగు నగరాల్లో అనేక కేసులు నమోదవడంతో ట్రంప్ గత మార్చి నుంచి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు.
తాజావార్తలు
-
Harish Rao : 5,420 కోట్ల ‘ట్రూ అప్’ భారాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్
-
Poland: పోలాండ్ పాఠశాలలో దుండగుడు కత్తితో వీరంగం.. ఏడుగురికి గాయాలు
-
Humayun Kabir: ‘‘బాబ్రీ మసీదు ఎమ్మెల్యే, ఇప్పుడు రాజకీయాలకు గుడ్ బై’’.. హుమాయున్ కబీర్ కన్నీరు!
-
Jim Jim Thara: లీకై వైరల్ అయిన ‘జిమ్ జిమ్ తార’ పాట వెనుక అసలు గుట్టు ఇదే!
-
Delhi: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. కూలిన మూడు అంతస్తుల బిల్డింగ్
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!