ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. దక్షిణ గాజా నగరమైన రఫాపై దాడి చేయవద్దని అమెరికా, ఇతర దేశాలు ఒత్తిడి చేస్తున్నా ఇజ్రాయెల్ వెనక్కి తగ్గడం లేదు. రఫాలో పాలస్తీయన్ ప్రజలు ఖాళీ చేయాలని, సురక్షిత ప్రదేశాలకు వెళ్లిపోవాలని మరోసారి ఇజ్రాయెల్ ఆదేశాలు జారీ చేసింది.
ఆన్ కౌల్టర్ అనే రచయిత్రి నిర్వహించిన పోడ్ కాస్ట్ షోలో పాల్గొన్న వివేక్ రామస్వామికి అవమానం ఎదురైంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం తీవ్రంగా పోటీపడి చివర్లో విరమించుకున్న వ్యాపారవేత్త వివేక్ రామస్వామి సుపరిచితమే.
భర్తతో విభేదాల కారణంగా కొడుకు తుపాకితో కాల్చిన తల్లి.. తానూ కాల్చుకుని చనిపోయింది. మెరికాలోని టెక్సాస్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లో కి వెళితే.. 32 ఏళ్ల సవన్నా క్రిగర్ కి తన భర్తతో విభేదాలు వచ్చాయి.
అగ్రరాజ్యం అమెరికాలో భారతీయ విద్యార్థుల మరణాలు తీవ్ర కలవరం రేపుతున్నాయి. ఈ ఏడాదిలోనే పలువురు హత్యకు గురయ్యారు. ఇటీవల హైదరాబాద్‌కు చెందిన విద్యార్థి కిడ్నాప్ అయి.. అనంతరం హత్యకు గురయ్యాడు.
ఖలిస్థాన్ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నున్ కేసులో భారత్‌కు రష్యా అండగా నిలిచింది. అమెరికా వాదనలను మాస్కో తీవ్రంగా ఖండించింది. అంతే కాకుండా 'భారత అంతర్గత వ్యవహారాల్లో అమెరికా జోక్యం చేసుకుంటోందని' ఆరోపించింది.
గత కొద్ది రోజులుగా అమెరికా యూనివర్సిటీలు పాలస్తీనా అనుకూల ఉద్యమాలతో దద్దరిల్లుతున్నాయి. పెద్ద ఎత్తున విద్యార్థులు ఆందోళనలు, నిరసనలు చేపట్టడంతో పోలీసులు ఉక్కుపాదం మోపారు.
అమెరికాలోని టెక్సాస్‌లో దారుణమైన ఓ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సవన్నా క్రీగర్ అనే 32 ఏళ్ల మహిళ తన 3 ఏళ్ల కుమారుడిని కాల్చి చంపి, ఆ తర్వాత తుపాకీతో తనకు తాను కాల్చుకుంది. దీంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. చనిపోయే ముందు తల్లి ఫోన్లో భయంకరమైన వీడియోను రికార్డు చేసింది. 'మీ తండ్రికి వీడ్కోలు చెప్పు' అంటూ వీడియోలో రికార్డైంది.
హష్ మనీ కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు వ్యతిరేకంగా అడల్ట్ ఫిల్మ్ స్టార్ స్టార్మీ డేనియల్స్ వాంగ్మూలం ఇచ్చారు. డేనియల్స్ మంగళవారం కోర్టుకు హాజరై, 2006లో అమెరికాలోని లేక్ తాహోలోని హోటల్లో ట్రంప్‌తో సెక్స్‌లో పాల్గొన్నారని, ఆమె అందుకున్న చెల్లింపు గురించి చెప్పారు.
ఇజ్రాయెల్ కు అమెరికా షాక్ ఇచ్చింది. అమెరికా మాటలను లెక్కచేయకుండా గాజాలోకి ప్రవేశించిన ఇజ్రాయెల్ కు వాషింగ్టన్ నుంచి అందాల్సిన కీలక ఆయుధాలు షిప్మెంట్ ను నిలిపేసినట్లు సమాచారం.
భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్ మూడో అంతరిక్ష యాత్ర ప్రస్తుతానికి వాయిదా పడింది. అయితే, కొత్త లాంచ్ తేదీ ఏమిటో ఇంకా స్పష్టంగా తెలియలేదు. సాంకేతిక లోపం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.