ఉక్రెయిన్‌పై యుద్ధానికి మద్దతుగా రష్యాకు ఉత్తర కొరియా వేలాది మంది సైనికులను పంపించింది. ఇప్పటికే రష్యాలోని కుర్క్స్ ప్రాంతంలో మోహరించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ముందు ఉక్రెయిన్‌పై దాడి చేసేందుకు ప్రణాళికలు రచించినట్లు తెలుస్తోంది. అమెరికా ఎన్నికలు జరగనున్న సమయంలో అణు, ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి పరీక్షలు చేపట్టాలని ఉత్తరకొరియా చూస్తోందని దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ ఆరోపించారు.
ఇది కూడా చదవండి: Suspended : ఎక్సైజ్ అధికారి ప్రభు వినయ్ సస్పెండ్
రష్యాలో ఉత్తర కొరియా దళాలు మోహరించినట్లు వచ్చిన వార్తలపై అమెరికా అధ్యక్షుడు బైడెన్ స్పందిస్తూ.. ఉక్రెయిన్ భూభాగంలోకి ప్రవేశించినట్లయితే ఉక్రెయిన్ తిరిగి దాడి చేయాలని సూచించారు. 10,000 మంది ఉత్తర కొరియా సైనికులు శిక్షణ పొందేందుకు రష్యా చేరుకున్నారన్న వార్తల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఉత్తర కొరియా యుద్ధంలో పాల్గొంటే ఉక్రెయిన్ తన ఆయుధాలను ఉపయోగించడంపై కొత్త పరిమితులు విధించబోమని అమెరికా పేర్కొంది. ప్రతీకార దాడులు ఉంటాయని బైడెన్ వార్నింగ్ ఇచ్చారు. కచ్చితంగా ఉత్తర కొరియా, రష్యాపై ఉక్రెయిన్ ప్రతీకారం తీర్చుకుంటుందని అమెరికా హెచ్చరించింది.
ఇది కూడా చదవండి: Pappu Yadav: ‘‘లారెన్స్ బిష్ణోయ్’’ ప్రకటనతో నాకు సంబంధం లేదు.. పప్పూ యాదవ్ భార్య..