US- Russia: రష్యా బలహీనపడింది.. అందుకే కిమ్ సైన్యం మద్దతు కోరుతుంది..!
- రష్యా- ఉత్తర కొరియా ఏం చేస్తున్నాయో గమనిస్తున్నాం: అమెరికా
- కిమ్ సైన్యం మద్దతు తీసుకోవడం క్రెమ్లిన్ బలహీనపడినట్లు సంకేతం..
- రష్యన్లతో పాటు ఉత్తర కొరియా సైనికులు కూడా యుద్ధంలో పాల్గొనే అవకాశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US- Russia: రష్యా- ఉత్తర కొరియా ఏం చేస్తున్నాయో గమనిస్తున్నామని యూఎస్ తెలిపింది. ఒకవేళ నార్త్ కొరియా సైన్యం ఉక్రెయిన్ యుద్ధంలోకి చొరబడితే.. ఖచ్చితంగా వాళ్లు కూడా తమ లక్ష్యంగా మారతారని అమెరికా వార్నింగ్ ఇచ్చింది. ఈ విషయాన్ని వైట్‌హౌస్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రతినిధి జాన్‌కిర్బీ ప్రకటించారు. అసలు కిమ్ జోంగ్ ఉన్ సైన్యం మద్దతు తీసుకోవడం క్రెమ్లిన్ బలహీనపడిందనే విషయం తెలియజేస్తోందని అతడు ఎద్దేవా చేశారు. ఇక, ఉత్తర కొరియాలోని వాన్సాన్ అనే ప్రాంతం నుంచి నౌకలో సైనికులు రష్యాలోని వ్లాదివాస్తోక్ చేరుకుంటున్నారనే విషయం మాకు తెలిసింది.. అక్కడి నుంచి పలు మిలటరీ ట్రైనింగ్ సెంటర్లకు వెళ్తున్నారని అమెరికా ఆరోపించింది. ఈ సైనికులను ఎక్కడ వాడుకొంటారనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదని యూఎస్ వెల్లడించింది. రష్యన్లతో పాటు వీరు కూడా యుద్ధంలో పాల్గొనే అవకాశం ఉంది.. ముఖ్యంగా ఉత్తర రష్యాలోని ఉక్రెయిన్ సరిహద్దులకు వీరు వెళ్లే అవకాశం ఎక్కువగా ఉందని జాన్ కిర్బీ వెల్లడించారు.
Read Also: Surya : అన్ స్టాపబుల్ సెట్లో కంగువ..
Also Read
- US-Iran: ఇరాన్ ఎయిర్‌లైన్స్‌కు అమెరికా భారీ షాక్.. ఎల్లుండి నుంచి ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోనున్న సర్వీసులు!
- Trump: పుతిన్ యుద్ధం ముగించాలనకుంటున్నారు.. జెలెన్స్కీనే హద్దు దాటారు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- Tarique Rrahman: తారిఖ్ రెహమాన్ అరుదైన రికార్డ్.. యూఎన్‌లో మూడో తరం నేతగా ప్రసంగం
- Trump vs Media: వార్తా సంస్థలను ‘కేన్సర్’తో పోల్చిన ట్రంప్.. కోర్టుకెళ్లనున్న మీడియా సంస్థలు
ఇక, వీరు యుద్ధ భూమిలో అడుగుపెడితే.. అది రష్యా నిరాశ, నిస్పృహను తెలుపుతుందని అమెరికా సెక్యూరిటీ కౌన్సిల్ ప్రతినిధి జాన్ కిర్బీ పేర్కొన్నారు. ఇప్పటి వరకు క్రెమ్లిన్ ఈ పోరులో తీవ్రంగా నష్టపోయింది. కానీ, పుతిన్ ఈ యుద్ధాన్ని కొనసాగించేందుకే ఇష్టపడుతున్నారు.. మాస్కో దగ్గర సైన్యం కొరవడి.. ప్యాంగ్‌యాంగ్‌ను ఆశ్రయించడమంటే అది బలహీనపడిందనే సంకేతం వస్తుందన్నారు. అలాగే, ఉత్తర కొరియా సైన్యానికి రష్యా నుంచి సహాయసహకారాలు అందడం అనేది ఐక్యరాజ్య సమితి ఆంక్షల ఉల్లంఘన కిందకు వస్తుందని కిర్బీ ప్రకటించారు. ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యాకు సపోర్టుగా నార్త్ కొరియా మరో 1500 మంది సైనికులను తరలించిందని బుధవారం దక్షిణ కొరియా ఇంటెలిజెన్స్ తెలిపింది. డిసెంబర్ నాటికి 10,000 మంది సైన్యాన్ని రష్యాకు పంపాలని ప్యాంగ్‌యాంగ్ ప్రణాళికలు వేస్తుందన్నారు. అయితే, ఇప్పటికే ఉక్రెయిన్‌పై పోరాడేందుకు ఉత్తర కొరియా ఈ నెలలో రష్యాకు 1,500 మందిని ప్రత్యేకదళంగా పంపినట్లు ధ్రువీకరించిన సౌత్ కొరియా గూఢచార సంస్థ.
తాజావార్తలు
-
Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
-
Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
-
Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
-
OTR: ఉమ్మడి తూర్పు గోదావరి ఫ్యాన్ లీడర్స్ కు లోకల్ టెన్షన్
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!