పౌర అశాంతి, నియంతృత్వం వైపు పయనం, నిరంతర ఉగ్రవాద బెదిరింపులు, అమెరికన్ వ్యతిరేక భావాల కారణంగా వెనిజులా దేశం వెళ్లొద్దని తన పౌరులకు అమెరికా హెచ్చరించింది.
అగ్రరాజ్యం అమెరికాలో ఘోర ప్రమాదం జరిగింది. అత్యంత వేగంగా దూసుకెళ్లిన కారు.. చెట్టును ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థులు మృతిచెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
తెలుగు వారు ఎక్కడికి వెళ్లిన రాణిస్తున్నారు. తమ ప్రతిభను కనబరిచి అగ్ర రాజ్యంలో సైతం గౌరవమైన పదవులను సొంతం చేసుకుంటున్నారు. తాజాగా అగ్రరాజ్యం అమెరికాలో తెలుగు మహిళకు అరుదైన గౌరవం దక్కింది. కాలిఫోర్నియాలోని శాక్రమెంటో సుపీరియర్ కోర్టు జడ్జిగా విజయవాడకు చెందిన జయ బాదిగ నియమితులయ్యారు.
ప్రస్తుతం నగదు దగ్గర ఉంచుకునే వాళ్ల సంఖ్య తగ్గింది. ప్రతిదీ ఆన్లైన్ మయంగా మారింది. డిజిటల్ చెల్లింపు విధానం విపరీతంగా పెరిగిపోయింది. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ ఫోన్ పే, గూగుల్ పే వాడుతున్నారు. చిరువ్యాపారి నుంచి పెద్ద పెద్ద వ్యాపారస్థుల వరకు అందరూ వాటిపైనే ఆధారపడుతున్నారు.
అమెరికా మరోసారి భారత్ ను మెచ్చుకుంది. భారత్ లో సార్వత్రికి ఎన్నికలపై అమెరికా ప్రశంసలు కురిపించింది. ప్రపంచంలో భారత్ కంటే శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశం మరొకటి లేదని కొనియాడింది. ఆ దేశ వైట్ హౌస్ జాతీయ భద్రతా సమాచార సలహాదారు జాన్ కిర్బీ ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ భారత్‌ను ప్రశంసించారు.
భారతీయ బ్రాండ్లయిన ఎవరెస్ట్, ఎండీహెచ్ మసాలా దినుసుల దిగుమతిపై నిషేధం విధించినట్లు నేపాల్ ఫుడ్ టెక్నాలజీ విభాగం ప్రతినిధి మోహన్ కృష్ణ మహారాజన్ తెలిపారు. మార్కెట్లో ఈ మసాలా దినుసుల అమ్మకాలను కూడా నిషేధించినట్లు వెల్లడించారు.
ఇరాన్‌లోని చాబహార్ పోర్టును పదేళ్లపాటు నిర్వహించేందుకు టెహ్రాన్‌తో భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఓడరేవును నిర్వహించడంతోపాటు భారత్ కూడా దీన్ని అభివృద్ధి చేస్తుంది. అయితే ఇప్పుడు ఈ ఒప్పందానికి సంబంధించి అమెరికా వార్నింగ్ ఇచ్చింది.
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు హమాస్ మిలిటెంట్లను రాక్షసులతో పోల్చారు. సోమవారం ఆయన హమాస్ దాడిలో అక్టోబరు 7న మృతి చెందిన ఇజ్రాయెలీల స్మారకార్థం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
ఖలిస్థాన్ కు మద్దతుగా మరోసారి నినాదాలు రాసిన ఉదంతం ఢిల్లీలో వెలుగు చూసింది. కరోల్ బాగ్, ఝండేవాలన్ మెట్రో స్టేషన్ల క్రింద ఖలిస్థాన్ అనుకూల నినాదాలు కనిపించాయి.
ప్రపంచంలోని 5 దేశాల్లో ఉన్న ఖలిస్తానీ టైగర్ ఫోర్స్ (కేటీఎఫ్)కి చెందిన 5 మంది మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు భారత్‌పై భారీ కుట్రకు ప్లాన్ చేస్తున్నారు. వారు విదేశాలలో నుంచి ప్లాట్లు చేస్తున్నారు.