అక్టోబర్ 7, 2023 ఎవరూ మరిచిపోలేని రోజు. ప్రపంచమంతా ఉలిక్కిపడ్డ రోజు. హమాస్ ముష్కరులు ఊహించని రీతిలో ఇజ్రాయెల్‌లోకి చొరబడి 1,200 మందిని చంపి దాదాపు 251 మందికి పైగా బందీలుగా తీసుకెళ్లిపోయారు. ఈ ఘటన ఇజ్రాయెల్‌నే కాకుండా యావత్తు ప్రపంచాన్ని కలవరపాటుకు గురిచేసింది.
ఒసామా బిన్ లాడెన్‌ను చంపిన వారిని ఎవరూ మరిచిపోరని ట్రంప్ పేర్కొన్నారు. ఆదివారం వర్జీనియాలోని నార్ఫోక్లో అమెరికా నావికాదళం 250వ ఉత్సవాలు సందర్భంగా జరిగిన ప్రత్యేక వేడుకలో ట్రంప్ ప్రసంగించారు.
మాదక ద్రవ్యాలపై అమెరికా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా వెనిజులా తీరంలో మరో డ్రగ్స్ నౌకపై అమెరికా దాడి చేసింది. ఈ ఘటనలో నలుగురు హతమయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
మైక్రోసాఫ్ట్‌లో కీలక హోదాలో ఉన్న లీసా మోనాకోను ఉద్యోగం నుంచి తొలగించాలని ట్రంప్ డిమాండ్ చేశారు. ప్రస్తుతం లీసా మోనాకో మైక్రోసాఫ్ట్‌లో గ్లోబల్ అఫైర్స్‌కు ప్రెసిడెంట్‌గా ఉన్నారు. బరాక్ ఒబామా హయాంలో జాతీయ భద్రతా సీనియర్ సలహాదారుగా కూడా విధులు నిర్వర్తించారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్-ప్రథమ మహిళ మెలానియా మధ్య వాగ్వాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లుగా చర్చించుకుంటున్నారు.
ఐక్యరాజ్యసమితిలో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రసంగాన్ని భారత్ తిప్పికొట్టింది. భారత్ దౌత్యవేత్త పెటల్ గహ్లోట్ మాట్లాడుతూ.. అణు బ్లాక్ మెయిల్ ముసుగులో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడాన్ని ఏ మాత్రం అంగీకరించబోమని తేల్చి చెప్పారు.
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అమెరికాకు వెళ్లారు. ఐక్యరాజ్యసమితి శిఖరాగ్ర సమావేశాల్లో శుక్రవారం ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ నుంచి సుదీర్ఘ ప్రయాణం చేసి అమెరికాకు చేరుకున్నట్లు నివేదికలు అందుతున్నాయి.
ప్రధాని మోడీ-అమెరికా అధ్యక్షుడు ట్రంప్ త్వరలో భేటీకాబోతున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. సుంకాలు కారణంగా రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. తాజా పరిణామాలను బట్టి చూస్తుంటే.. రెండు దేశాల మధ్య సంబంధాలు మరోసారి బలపడే సూచనలు కనిపిస్తున్నాయి.
ప్రస్తుత మానవ చరిత్రలో ప్రపంచంలోనే అత్యంత విధ్వంసకరమైన ఆయుధ పోటీ నెలకొందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అన్నారు. న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి శిఖరాగ్ర సమావేశంలో జెలెన్స్కీ ప్రసంగించారు. ఎవరు బతకాలో ఆయుధాలే నిర్ణయిస్తున్నాయని.. ఈ తీరు మారాలని కోరారు.
పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. యూఎన్ సమావేశాల్లో పాల్గొనేందుకు అమెరికా వెళ్లారు. ఇక ట్రంప్ ఆహ్వానం మేరకు గురువారం వైట్‌హౌస్‌కు వెళ్లనున్నారు. ట్రంప్‌తో షెహబాజ్ షరీఫ్‌తో పాటు అసిమ్ మునీర్ కూడా హాజరు కావడంపై సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది.