భారత్-యూరోపియన్ యూనియన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం జరుగుతున్న వేళ అగ్ర రాజ్యం అమెరికా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. యూరప్ తనకు వ్యతిరేకంగా యుద్ధానికి నిధులు సమకూర్చుతోందని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ ఆరోపించారు.
ఇది కూడా చదవండి: Off The Record: పబ్లిసిటీ కోసం వెళ్లి హోంమంత్రి ఇరుకునపడ్డారా..?
భారత్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చేసుకునేందుకు యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్ ఢిల్లీకి వచ్చారు. జనవరి 26న జరిగిన రిపబ్లిక్ డే వేడుకలకు అతిథిగా కూడా హాజరయ్యారు. మంగళవారం భారత్‌తో వాణిజ్య ఒప్పందంపై కీలక ప్రకటన రానుంది. దాదాపు 18 ఏళ్ల నుంచి జరుగుతున్న ఈ చర్చలు చివరి దిశగా చేరుకున్నాయి. ఒప్పందం జరిగాక చట్టపరంగా పరిశీలించడానికి 5-6 నెలల సమయం పడుతుందని.. అనంతరం ఇరు పక్షాలు సంతకాలు జరుగుతాయని వాణిజ్య కార్యదర్శి రాజేష్ అగర్వాల్ అన్నారు. సంతకాలు పూర్తయ్యాక వచ్చే ఏడాది నుంచి ఒప్పందం అమల్లోకి రానుందని తెలిపారు.
ఇది కూడా చదవండి: Tragedy : చైనా మాంజాకు ఐదేళ్ల చిన్నారి బలి.. తండ్రి కళ్ల ముందే ఘోరం.!
అయితే యూరోపియన్ యూనియన్‌తో కీలక ఒప్పందం జరుగుతున్న వేళ అమెరికా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏబీసీ న్యూస్‌తో స్కాట్ బెసెంట్ మాట్లాడుతూ.. భారతదేశం రష్యా దగ్గర చమురు కొనుగోలు చేయడంతో 25 శాతం సుంకం విధించామని.. కానీ గతం వారం ఏం జరిగిందో తెలిసిందే కదా? యూరోపియన్లు భారతదేశంతో వాణిజ్య ఒప్పందం చేసుకుంటున్నారన్నారు. అంటే స్పష్టంగా చెప్పాలంటే.. రష్యన్ చమురు భారతదేశంలోకి వెళ్తుందని.. అక్కడ నుంచి శుద్ధి చేసిన ఉత్పత్తులు బయటకు వస్తాయని.. ఆ శుద్ధి చేసిన ఉత్పత్తులను యూరోపియన్లు కొనుగోలు చేస్తారని పేర్కొన్నారు. అంటే వారు తమపై యుద్ధానికి నిధులు సమకూర్చుతున్నారని వ్యాఖ్యానించారు. భారత్‌తో వాణిజ్య ఒప్పందం చేసుకోవడం ద్వారా మిత్ర ధర్మాన్ని మీరుతున్నాయని ఆరోపించారు. రష్యా దగ్గర భారత్ చమురు కొనుగోలు చేయడంతోనే.. దాని ద్వారా వచ్చే నిధులతో ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తోందని పేర్కొన్నారు. ఇప్పుడు భారత్ దగ్గర ఐరోపా శుద్ధి చేసిన చమురు ఉత్పత్తులు కొనుగోలు చేసి యుద్ధానికి నిధులు సమకూరుస్తుందని ధ్వజమెత్తారు.
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ఆపడానికి ట్రంప్ ఎంతగానో కృషి చేశారని ప్రశంసించారు. యూరోపియన్ల కంటే చాలా పెద్ద త్యాగమే చేశారని కొనియాడారు. నాలుగేళ్ల నుంచి జరుగుతున్న యుద్ధానికి ముగించేందుకు ట్రంప్ ప్రయత్నిస్తున్నారని.. చివరికి ముగించేస్తామని స్కాట్ బెసెంట్ పేర్కొన్నారు.