చైనాతో కెనడా వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. ట్రంప్ హెచ్చరికల తర్వాత చైనాతో వాణిజ్య ఒప్పందం కొనసాగించడం ఉద్దేశం లేదని కెనడా ప్రధాని మార్క్ కార్నీ ప్రకటించారు. ఈ వ్యవహారం ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరిచింది.
ఇది కూడా చదవండి: US: అమెరికాలో మంచు తుఫాన్ విధ్వంసం.. లక్షలాది ఇళ్లల్లో అంధకారం
ఇటీవల చైనాతో కెనడా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చేసుకుంది. ఈ వ్యవహారం ట్రంప్‌కు రుచించలేదు. కెనడాపై తీవ్రంగా మండిపడ్డారు. మాపై ఆధారపడి బ్రతుకుతూ ఏ మాత్రం కృతజ్ఞత లేదని.. అయినా ఏడాదిలోపే కెనడాను చైనా తినేస్తోందని బెదిరించారు. అంతేకాకుండా కెనడా వస్తువులపై 100 శాతం సుంకం విధిస్తానని ట్రంప్ తాజాగా హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: HYDRA DRF Rescue: అర్ధరాత్రి ఆపద.. తొమ్మిది మంది ప్రాణాలని కాపాడిన హైడ్రా DRF బృందం
దీంతో కెనడా ప్రధాని మార్క్ కార్నీ వెనకడుగు వేశారు. చైనాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని కొనసాగించే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. అమెరికా-మెక్సికో-కెనడా వాణిజ్య ఒప్పందానికే కట్టుబడి ఉన్నట్లు తేల్చి చెప్పారు. చైనా లేదా ఇతర ఏ మార్కెటేతర ఆర్థిక వ్యవస్థలతో సంబంధాలు కొనసాగించే ఉద్దేశం లేదన్నారు. ట్రంప్ వార్నింగ్ చేసిన గంటల వ్యవధిలోనే మార్క్ కార్నీ నుంచి ఈ ప్రకటన రావడంతో అందర్నీ ఆశ్చర్య పరిచింది.
గ్రీన్‌లాండ్‌లో ‘గోల్డెన్ డోమ్’ ఏర్పాటుకు అమెరికా సిద్ధమవుతోంది. అయితే ఈ నిర్ణయాన్ని కెనడా ప్రధాని మార్క్ కార్నీ తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో ట్రంప్-కార్నీ మధ్య మాటల యుద్ధం నడిచింది. మిత్రదేశాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తాయి. దీంతో మొత్తానికి మార్క్ కార్నీ వెనక్కి తగ్గారు.
PM Mark Carney responds to Trump's 100% tariffs threats
"We have commitments under CUSMA not to pursue free trade agreements with non-market economies without prior notification. We have no intention of doing that with China or any other non-market economy." pic.twitter.com/oAdDN7lYPf
— 6ixBuzzTV (@6ixbuzztv) January 25, 2026