ముంబై పేలుళ్ల నిందితుడు తహవూర్ రాణాకు అమెరికాలో దారులన్నీ మూసుకుపోయాయి. భారత్‌కు అప్పగించొద్దంటూ వేసిన పిటిషన్లను అమెరికా సుప్రీంకోర్టు తిరస్కరించింది. దీంతో భారత్‌కు అప్పగించేందుకు అమెరికాలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన అధిక సుంకాలతో ఇప్పటికే ప్రపంచ మార్కెట్లు కుదేల్ అయిపోతున్నాయి. వ్యవస్థలన్నీ అతలాకుతలం అయిపోతున్నాయి. ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ఇలా ప్రపంచ దేశాలన్నీ తీవ్ర సతమతం అవుతున్నాయి. ఇలాంటి సమయంలో ట్రంప్ మరోసారి చైనాకు బిగ్ షాకిచ్చారు.
Shruti Chaturvedi: భారతీయ యువ వ్యాపారవేత్త శ్రుతి చతుర్వేదికి అగ్రరాజ్యం అమెరికాలో చేదు అనుభవం ఎదురైంది. అలస్కా ఎయిర్‌పోర్టులో తనను ఎఫ్‌బీఐ అధికారులు సుమారు 8 గంటల పాటు అన్యాయంగా నిర్బంధించారని ఆరోపణలు చేశారు.
చైనాపై ట్రంప్ విధించిన సుంకాలను టెస్లా అధినేత, ట్రంప్ సలహాదారుడు ఎలోన్ మస్క్ తీవ్రంగా తప్పుపట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో మనసు మార్చుకోవాలని ట్రంప్‌ను మస్క్ కోరినట్లు తెలుస్తోంది.
ఇరాన్‌కి మరోసారి అణు ఒప్పందం విషయంలో తీవ్ర వార్నింగ్ ఇచ్చారు. అమెరికాతో ఇరాన్ అణు ఒప్పందం చేసుకుంటే మంచిది అని.. లేదంటే పెద్ద ప్రమాదంలో పడతారని ట్రంప్ హెచ్చరించారు. సోమవారం ట్రంప్‌తో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు భేటీ అయ్యారు.
Piyush Goyal: చైనాపై మరోసారి కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ విమర్శలు గుప్పించారు. అన్యాయమైన వాణిజ్య పద్ధతులను ఉపయోగించి చైనా ఆర్థిక వృద్ధిని సాధిస్తోందని ఆరోపించారు.
US-China Trade War: చైనా - అమెరికా దేశాల మధ్య టారిఫ్‌ల యుద్ధం కొనసాగుతోంది. పన్నుల విషయంలో అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన డెడ్ లైన్‌కు తాము భయపడబోమని డ్రాగన్ కంట్రీ స్పష్టం చేసింది.
ముంబై పేలుళ్ల నిందితుడు తహవూర్ రాణా(64)కు మరోసారి అమెరికా సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భారత్‌కు అప్పగించొద్దంటూ అమెరికా సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఇప్పటికే పలుమార్లు పిటిషన్లు కొట్టేసింది. తాజాగా మరోసారి తహవూర్ రాణా పిటిషన్‌ను తిరస్కరించింది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన సుంకాలు కారణంగా ప్రపంచ మార్కెట్లు కుదేల్ అయిపోయాయి. లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. కోవిడ్ సమయంలో ఎదురైన భారీ పతనం.. మరోసారి ట్రంప్ టారిఫ్‌లు కారణంగా చవిచూశాయి. ఇక ట్రంప్‌నకు ధీటుగా చైనా కూడా సుంకాలు పెంచేసింది.
ఉక్రెయిన్-రష్యా యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి స్పందించారు. ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో మాట్లాడుతూ.. ఆ రెండు దేశాలు యుద్ధం ఆపాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఇరు దేశాలు పదే పదే బాంబులు వేసుకోవడం ఏ మాత్రం ఇష్టం లేదని చెప్పుకొచ్చారు.