అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ H-1B వీసాల నియమాలను మార్చారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ H1-B వీసాల దరఖాస్తు రుసుమును US$100,000 కు పెంచే ప్రకటనపై సంతకం చేశారు. ఈ చర్య అమెరికాలోని వర్క్ వీసాలపై భారతీయ కార్మికులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. H1-B దరఖాస్తుదారులను స్పాన్సర్ చేయడానికి కంపెనీలు చెల్లించే రుసుమును US$100,000 కు పెంచే ప్రకటనపై ట్రంప్ శుక్రవారం సంతకం చేశారు. Also Read:Cyber Fraud : వృద్ధుడి ఆధార్ కార్డు మానవ…
భారతదేశానికి, ప్రధాని మోడీకి చాలా దగ్గరగా ఉన్నానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. బ్రిటన్ పర్యటనలో ఉన్న ట్రంప్‌ను ఆంక్షలపై అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు భారత్‌పై ఆంక్షలు విధించినట్లు చెప్పుకొచ్చారు.
ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ హత్యపై అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా కీలక వ్యాఖ్యలు చేశారు. చార్కీ కిర్క్ వాదనలతో తాను ఏకీభవించడం లేదని తేల్చి చెప్పారు. ఇక చార్లీ హత్య తర్వాత ట్రంప్.. దేశాన్ని ఏకం చేయడం కాకుండా.. దేశాన్ని విభజిస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.
చార్లీ కిర్క్.. ట్రంప్ సన్నిహితుడు, జాతీయవాది సెప్టెంబర్ 10న ఉతా వ్యాలీ యూనివర్సిటీలో అత్యంత దారుణంగా హత్యకు గురయ్యారు. దుండగుడు జరిపిన కాల్పుల్లో చార్లీ కిర్క్ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన అమెరికాతో పాటు ప్రపంచ దేశాలు దిగ్భ్రాంతికి గురయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా సంతాపం వ్యక్తం చేశారు. ఇక అమెరికా ప్రజలు కన్నీటిపర్యంతం అయ్యారు.
అమెరికా దేశ చరిత్రలో న్యూయార్క్ టైమ్స్ వార్తాపత్రిక అత్యంత చెత్త పత్రిక అని డొనాల్డ్ ట్రంప్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దేశంలోనే అత్యంత దిగజారుడు వార్తాపత్రిక అంటూ నిప్పులుచెరిగారు. ‘‘రాడికల్ లెఫ్ట్ డెమోక్రాట్ పార్టీకి వర్చువల్ మౌత్ పీస్"గా ట్రంప్ అభివర్ణించారు.
అంతర్జాతీయ జలాల్లో అమెరికా వెళ్తున్న వెనిజులా మాదకద్రవ్య నౌకను అమెరికా సైన్యం పేల్చేసింది. ఈ మేరకు ట్రంప్ ప్రకటించారు. మాదక ద్రవ్యాలు అమెరికన్లను విషపూరితం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
అగ్ర రాజ్యం అమెరికాలో రోజురోజుకూ దారుణాలు పెరిగిపోతున్నాయి. ప్రజలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని మారణహోమం సృష్టిస్తున్నారు. ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ హత్య మరువక ముందే మరో హత్య కలకలం రేపుతోంది.
ట్రంప్ సన్నిహితుడు, జాతీయవాది చార్లీ కిర్క్ (31) హత్య అమెరికాను కుదిపేసింది. ట్రంప్‌కు అత్యంత దగ్గర మనిషిగా పేరుగాంచిన చార్లీ కిర్క్ హత్యకు గురి కావడంతో అధ్యక్షుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
అగ్ర రాజ్యం అమెరికాలో దారుణం జరిగింది. అధ్యక్షుడు ట్రంప్ సన్నిహితుడు, కన్జర్వేటివ్ యాక్టివిస్ట్ చార్లీ కిర్క్ (31) దారుణ హత్యకు గురయ్యాడు. ఉతా వ్యాలీ యూనివర్సిటీలోని ఒక కార్యక్రమంలో ప్రసంగిస్తుండగా దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. దీంతో చార్లీ కిర్క్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
భారత్-అమెరికా మధ్య సంబంధాలు మళ్లీ బలపడుతున్నాయి. రెండు దేశాల మధ్య సానుకూల వాతావరణం వెలువడుతోంది. భారీగా సుంకం విధించడంతో ఇరు దేశాల మధ్య గ్యాప్ వచ్చింది. ఈ నేపథ్యంలో బుధవారం ట్రంప్ కీలక పోస్ట్ చేశారు.