Trump: వెనిజులాపై ఉపయోగించిన సీక్రెట్ వెపన్ పేరు వెల్లడించిన ట్రంప్
- వెనిజులా అధ్యక్ష భవనంపై అమెరికా దాడి
- సీక్రెట్ వెపన్ ఉపయోగించినట్లు ట్రంప్ వెల్లడి
- ఆయుధం పేరు వెల్లడించిన ట్రంప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వెనిజులా అధ్యక్ష భవనంపై అమెరికా దాడి చేసి అధ్యక్షుడు నికోలస్ మదురో, అతని భార్యను కిడ్నాప్ చేసుకుని వెళ్లిపోయారు. నిమిషాల వ్యవధిలోనే అమెరికా ఆపరేషన్ ముగించేసింది. ఈ వ్యవహారం ప్రపంచ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. వెనిజులా దగ్గర చైనా, రష్యా ఆయుధాలు ఉన్నాయి. అవి ఏ మాత్రం పని చేయలేదు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశం అయింది. అయితే దీనికి కారణం అమెరికా రహస్య ఆయుధాన్ని ఉపయోగించిందని ప్రచారం జరిగింది. ఆ మధ్య ట్రంప్ కూడా ఒప్పుకున్నారు.
ఇది కూడా చదవండి: Himachal Pradesh: మనాలిలో మంచు తుఫాన్ బీభత్సం.. 10 కి.మీ ట్రాఫిక్ జామ్
Also Read
- Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
- H-1B Visa: భారతీయ ఐటీ నిపుణులకు ట్రంప్ షాక్.. హెచ్-1బీ వీసా రుసుము భారీగా పెంపు..
- Strait of Hormuz: హోర్ముజ్‌పై ఇరాన్ కొత్త ప్లాన్.. ప్రపంచ దేశాలకు బిగ్ షాక్..
- Jinping: భారీ బృందంతో ఢిల్లీకి వస్తున్న చైనా అధ్యక్షుడు.. బ్రిక్స్‌లో పాల్గొననున్న జిన్‌పింగ్
తాజాగా వెనిజులాపై ఉపయోగించిన సీక్రెట్ వెపన్ పేరును ట్రంప్ వెల్లడించారు. వెనిజులా సైన్యాన్ని నిర్వీర్యం చేసేందుకు అమెరికా ‘‘ది డిస్కాంబోబ్యులేటర్’’ ఆయుధాన్ని ఉపయోగించినట్లు చెప్పారు. శుక్రవారం న్యూయార్క్ పోస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ యుధం కారణంగా కారకాస్‌లో దాదాపు అన్ని లైట్లను ఆర్పేసిందని.. అంతేకాకుండా ఆ ఆయుధం వెనిజులా ఆయుధాలు పని చేయకుండా చేసిందని వివరించారు. ఇంతకు మంచి ఆ ఆయుధం గురించి ఇంకేమి చెప్పబోనని పేర్కొన్నారు. దాని గురించి ఎక్కువ మాట్లాడదల్చుకోలేదు. తమ సైన్యం ఎలా విజయం సాధించగలిగిందో వివరించలేనని చెప్పుకొచ్చారు. అయితే ‘డిస్కాంబోబ్యులేటర్ గురించి మాట్లాడటానికి నాకు అనుమతి లేదు.’’ అని ట్రంప్ పేర్కొన్నారు. అయితే ఆ ఆయుధం వెనిజులా పరికరాలను పనిచేయకుండా చేసిందని తెలిపారు.
ఇది కూడా చదవండి: US: అమెరికాలో కూలిన విమానం.. రన్‌వేపై తల్లకిందులైన జెట్
వెనిజులా దగ్గర రష్యా, చైనా రాకెట్లు ఉన్నాయని.. కానీ ఒక్కటి కూడా ప్రయోగించలేకపోయారని.. తమ సైన్యం వెనిజులాలోకి ప్రవేశించగానే వారు బటన్లు నొక్కినప్పుడు ఏమీ పని చేయలేదని.. అప్పటికే వారంతా సిద్ధంగా ఉన్నారని చెప్పారు. తమ సైన్యం దాడులు కొనసాగుతాయని.. మాదకద్రవ్యాల కార్టెల్‌లను లక్ష్యంగా చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నందున దక్షిణ అమెరికా నుంచి ఉత్తర అమెరికాకు విస్తరించవచ్చని ట్రంప్ సూచించారు. ‘‘మాకు వారి మార్గాలు తెలుసు. వారి గురించి మాకు అన్నీ తెలుసు. వారి ఇళ్లు మాకు తెలుసు. వారి గురించి మాకు అన్నీ తెలుసు.’’ అని ట్రంప్ అన్నారు.
ఇక వెనిజులా ప్రతిపక్ష నాయకురాలు మచాడో అందజేసిన నోబెల్ శాంతి బహుమతిని ఎక్కడ పెట్టాలో ఆలోచిస్తున్నామని.. ప్రస్తుతం ఓవల్ కార్యాలయంలోని విగ్రహానికి ఆనుకుని ఉందని చెప్పారు.
తాజావార్తలు
-
YS Jagan: ఏకగ్రీవాలకు అంగీకరిస్తే వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఉండవు.. వైసీపీ నేతలకు జగన్ హెచ్చరిక
-
Bihar: బీహార్‌లో రణరంగం.. సీఎం ఇంటి ముట్టడికి దూసుకెళ్లిన BPSC అభ్యర్థులు.. లాఠీఛార్జ్, వాటర్ కెనన్ల ప్రయోగం
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
SRK Mannat: షూటింగ్ నుంచి గెంటేసిన ఇంటినే కొన్న కింగ్ ఖాన్.. రూ.300 కోట్ల ‘మన్నత్’ అసలు కథ ఇదే
-
Duleep Trophy: వైభవ్ సూర్యవంశీ స్పిన్ మ్యాజిక్.. ఒకే ఓవర్లో రెండు వికెట్లు..!
ట్రెండింగ్
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్‌ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!