డబ్ల్యూడబ్ల్యూఈలో ‘ది టాస్క్‌మాస్టర్’గా పేరొందిన రెజ్లింగ్ లెజెండ్ కెవిన్ సుల్లివన్ (74) కన్నుమూశారు. 1990లో డస్టీ రోడ్స్ మరియు హల్క్ హొగన్ వంటి తోటి లెజెండ్లతో పేరు ప్రఖ్యాతలు సంపాదించాడు.
అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ మీకు గుర్తుండే ఉంటుంది...ఆ సంస్థ చేసిన తాజా ప్రకటన ఇప్పుడు భారత్ ను ఆందోళనకు గురి చేస్తోంది.
Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. ట్రంప్ ప్రయాణిస్తున్న విమానం ఇవాళ (శనివారం) పని చేయకపోవడంతో అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది.
లాంగ్ మార్చ్ 6ఏ రాకెట్‌ను ఉపయోగించిన చైనా తన మొదటి బ్యాచ్ ఇంటర్నెట్ ఉపగ్రహాలను ఆగస్టు 6, 2024న ప్రయోగించింది. 18 ఉపగ్రహాలను ప్రయోగించారు. ఎలోన్ మస్క్ యొక్క స్టార్ లింక్ ఉపగ్రహాలతో పోటీ పడడమే లక్ష్యంగా చైనా ముందుకు సాగుతోంది.
అమెరికాలోని న్యూ హాంప్‌షైర్‌కు చెందిన మత్స్యకారుడు జోసెఫ్ క్రామెర్ సముద్రంలో చేపలు, ఎండ్రకాయల వేటకు వెళ్లాడు. మంచి ఆదాయాన్ని ఆర్జించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు.
తెలంగాణలో పెట్టుబడులకు అపారమైన అవకాశాలున్నాయని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పరిశ్రమల అవసరాలు, అభిరుచికి అనుగుణంగా తమ ప్రభుత్వం నూతన పారిశ్రామిక విధానాన్ని రూపొందిస్తుందని ప్రకటించారు. అమెరికాలో ఉన్న వ్యాపార అవకాశాలన్నీ తెలంగాణలో ఉన్నాయని, చైనాకు ప్రత్యామ్నాయంగా ఎదగాలనేది తమ సంకల్పమని అన్నారు. తెలంగాణ అంటేనే వ్యాపారం.. తెలంగాణ అంటేనే పెట్టుబడులకు గమ్యస్థానంగా మారుస్తామని చెప్పారు.
బంగ్లాదేశ్‌లో నెలకొన్న పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం మంగళవారం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి ఆమ్ ఆద్మీ పార్టీ మినహా ఇండియా కూటమిలోని పార్టీలను కేంద్రం ఆహ్వానించింది.
కాలం కలిసి రాకపోతే తాడే పామై కరుస్తుందంట. షేక్ హసీనా విషయంలో ఇది అక్షరాల నిజమైంది. షేక్ హసీనాకు నమ్మకంగా ఉంటూనే ఆర్మీ చీఫ్ వకార్-ఉజ్-జమాన్ (58) వెన్నుపోటు పొడిచినట్లుగా తెలుస్తోంది.
పెద్దోళ్లతో కయ్యాలు పెట్టుకోవద్దని అప్పుడప్పుడు పెద్దలు చెబుతుంటారు. ఇది మనుషుల మధ్య జరిగే సంభాషణే అయినా.. ఇది మాత్రం ఒక దేశం విషయంలో అక్షరాలు నిజమైనట్లుగా సమాచారం.