Gautam Adani: బిలియన్ డాలర్ల లంచం, మోసానికి పాల్పడినట్లు అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీపై న్యూయార్క్‌లో ఓ కేసు నమోదు అయింది. భారత్ లో పోర్టులు, విమానాశ్రయాలు, ఇంధన రంగాల్లో నెంబర్ వన్ పారిశ్రామిక వేత్తగా ఉన్న ఆయనపై.. నిధుల సేకరణ కోసం లంచం ఇచ్చేందుకు ట్రై చేశాడని యూఎస్ లోని న్యూయార్క్ లో నేరారోపణలు వచ్చాయి.
Read Also: IPL 2025 Auction: అతడికి ఆల్‌టైమ్ రికార్డు ధర పక్కా.. సురేష్ రైనా జోస్యం!
ఈ కేసులో గౌతమ్ అదానీ సహా ఆయన బంధువు సాగర్ అదానీ పాటు మరో ఏడుగురు ఇందులో నిందితులుగా ఉన్నట్లు న్యూయార్క్ అధికారులు చెప్పుకొచ్చారు. రాబోయే 20 ఏళ్లలో 2 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని సంపాదించేందుకు భారత ప్రభుత్వ అధికారులకు సుమారు 265 మిలియన్ డాలర్ల లంచాలు చెల్లించినట్లు తెలుస్తుంది. అయితే, అదానీ గ్రీన్ ఎనర్జీలో అక్రమ మార్గాల ద్వారా.. ఆ కంపెనీ రుణ దాతలు, పెట్టుబడిదారుల నుంచి 3 బిలియన్ డాలర్లకు పైగా రుణాలు, బాండ్లను సేకరించిందని అధికారులు ఆరోపణలు చేశారు. కాగా, ఈ విషయంపై అదానీ గ్రూప్ ఇప్పటి వరకు రియాక్ట్ కాలేదు.