US Shooting: అగ్రరాజ్యం అమెరికాలో గత వారాంతం పలు ప్రాంతాల్లో కాల్పుల కలకలం రేపుతుంది. మిషిగన్‌లోని డెట్రాయిట్ నగరంలో ఆదివారం తెల్లవారుజామున జరిపిన కాల్పుల ఘటనలో ఇద్దరు మరణించగా.. 19 మంది తీవ్రంగా గాయపడ్డారు.
టీ20 వరల్డ్ కప్ 2024 ఫైనల్లో భారత జట్టు 7 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించి టైటిల్ సొంతం చేసుకుంది. బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్ మైదానంలో రోహిత్ శర్మ ట్రోఫీని తీసుకున్నారు. 140 కోట్ల మంది దేశప్రజల ఆనందానికి అవధులు లేవు.
North Korea: ఉత్తర కొరియా, దక్షిణ కొరియాల మధ్య తీవ్ర వాగ్వాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆదివారం దక్షిణ కొరియా, జపాన్, అమెరికా సంయుక్త సైనిక విన్యాసాలను ఉత్తర కొరియా తీవ్రంగా ఖండించింది.
అమెరికా విదేశాంగ శాఖ విడుదల చేసిన మత స్వేచ్ఛ నివేదికను భారత్ నేరుగా తిరస్కరించింది. మత స్వేచ్ఛపై అమెరికా విదేశాంగ శాఖ నివేదికను తిరస్కరిస్తున్నామని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు.
ఈ ఏడాది నవంబర్ 5న అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ప్రక్రియలో భాగంగా శుక్రవారం ఉదయం భారత కాలమానం ప్రకారం ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు చర్చ జరిగింది.
కల్కి 2898 ఏడీ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తోంది. కేవలం ఉత్తర అమెరికాలో ప్రీమియర్ల ద్వారా ఆల్-టైమ్ రికార్డును నెలకొల్పడం ద్వారా ఈ చిత్రం అపూర్వమైన మైలురాయిని సాధించింది. ప్రభాస్ హీరోగా నటించి 'కల్కి 2898 ఏడీ' మూవీకి సంబంధించి అమెరికాలో అడ్వాన్స్ సేల్స్ దిమ్మదిరిగిపోయేలా సాగుతున్నాయి. ఇప్పటికే ''ఆర్ఆర్ఆర్'' పేరిట ఉన్న మునుపటి రికార్డును అధిగమించింది.
America : ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు వేడి తీవ్రతను ఎదుర్కొంటున్నాయి. మండుతున్న ఎండల కారణంగా భారత్, పాకిస్థాన్, సూడాన్, బ్రిటన్, అమెరికా వంటి పలు దేశాలు తీవ్ర వేడిని చవిచూస్తున్నాయి.
అమెరికాలో మరో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓక్లహామా సిటీలో ఓ హోటల్ మేనేజర్‌గా పని చేస్తున్న 59 ఏళ్ల భారతీయ-అమెరికన్ హేమంత్ మిస్త్రీ అనే వ్యక్తి పై ఓ దుండగుడు దాడి చేసి పిడిగుద్దులు కురిపించాడు. దీంతో హేమంత్ ప్రాణాలు కోల్పోయాడు.
అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా పేరిట ఎన్నో రికార్డులు ఉన్నాయి. అంతరిక్ష విజ్ఞాన రంగంలో ప్రజలు ఈ ఏజెన్సీ పేరును ఎంతో గౌరవంగా తీసుకుంటారు. అయితే.. ఇప్పుడు నాసాకి ఓ వ్యక్తి పెద్ద షాక్ ఇచ్చాడు.
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తన వారపు మంత్రివర్గ సమావేశాన్ని ఆదివారం జెరూసలెంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అమెరికా నుంచి వస్తున్న ఆయుధాలపై చర్చ జరిగింది. ఆయుధాల సరఫరాను అమెరికా నిలిపివేస్తోందని బెంజమిన్ నెతన్యాహు సమావేశంలో అన్నారు.