Trump: పందెంలో ఓడిపోయిన వ్యక్తికే ట్రంప్ అందలం.. వీడియో వైరల్
- పందెంలో ఓడిపోయిన వ్యక్తికే ట్రంప్ అందలం
- డబ్ల్యూడబ్ల్యూఈ రింగులో గుండు కొట్టిన ట్రంప్
- తాజాగా సోషల్ మీడియాలో వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ త్వరలో బాధ్యతలు చేపట్టనున్నారు. జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. అయితే ఆయన ఇప్పటి నుంచే ప్రభుత్వ కూర్పు చేసుకుంటున్నారు. ఇప్పటికే ఆయా కీలక పోస్టుల్లో అనుభవజ్ఞులను నియమిస్తున్నారు. తాజాగా విద్యాశాఖ చీఫ్‌గా 76 ఏళ్ల లిండా మెక్‌మాన్ అనే మహిళను నియమించారు. ఈమె ట్రంప్‌నకు అత్యంత సన్నిహితురాలు. లిండా.. డబ్ల్యూడబ్ల్యూఈ మాజీ సీఈవో కూడా. మాజీ రెజ్లింగ్ ఎగ్జిక్యూటివ్ అయిన ఆమెకు కీలక బాధ్యతలు అప్పగించారు. లిండా మెక్‌మాన్‌తో పాటు ఆమె భర్త లిన్స్ మెక్‌మాన్‌తోనూ ట్రంప్‌నకు మంచి సత్సంబంధాలు ఉన్నాయి. అయితే తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో చక్కర్లు కొడుతోంది. లిన్స్ మెక్‌మాన్‌కు ట్రంప్ గుండు కొట్టించిన వీడియోను అమెరికన్లు గుర్తుచేసుకుంటున్నారు. ప్రస్తుతం ఆ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

Also Read
- Tectonic plate movement: మారిపోనున్న ప్రపంచ పటం.. ఒక్కటి కానున్న అమెరికా-రష్యా.!
- Israel: ఇజ్రాయిల్ వెళ్లే విమానాల్లో పాక్ పైలట్లు, సిబ్బందిపై నిషేధం..!
- Crude Oil Prices Rise: చమురు ధరలకు మళ్లీ రెక్కలు.. భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయా..?
- Saudi Arabia: మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు.. హిందూ వ్యక్తికి మరణశిక్ష నుంచి ఊరట..
2007, జనవరిలో రా ఎపిసోడ్ జరిగింది. ప్రతి బిలియనీర్ ఒక ప్రొఫెషనల్ రెజ్లర్‌ను ఎంచుకున్నారు. డొనాల్డ్ ట్రంప్.. బాబీ లాష్లేని ఎంచుకోగా.. లిన్స్ మెక్‌మాన్.. ఉగామాను ఎంచుకున్నారు. అయితే ఓడిపోయిన వ్యక్తి రింగులో గుండు చేయించుకోవాలని పందెం వేసుకున్నారు. అయితే ఈ పందెంలో లిన్స్ మెక్‌మాన్ మద్దతు తెలిపిన ఉమాగా ఓడిపోయాడు.. ట్రంప్ మద్దతు పలికిన బాబీ లాష్లే విజయం సాధించాడు. దీంతో లిన్స్ ఓడిపోవడంతో ట్రంప్.. రింగులోకి ప్రవేశించి లిన్స్ మెక్‌మాన్ గుండు కొట్టారు. తల మీద క్రీమ్ రాసి మరీ గుండు కొట్టారు. తాజాగా లిండా మెక్‌మాన్‌ను విద్యాశాఖ చీఫ్‌గా నియమించడంతో 17 ఏళ్ల నాటి సంఘటనను అమెరికన్లు గుర్తుచేసుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను మీరు కూడా చూసేయండి.
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్… హైదరాబాద్‌లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..