అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా డెమోక్రాటిక్ అభ్యర్థి కమలా హారిస్ విచ్చలవిడిగా దుబారా ఖర్చులు చేసినట్లుగా ద టెలిగ్రాఫ్ కథనం పేర్కొంది. ఐస్ క్రీములు, పుడ్ డెలివరీకే 24 వేల డాలర్లు (రూ.20,27,465) ఖర్చు పెట్టినట్లు తెలిపింది. స్పాన్సర్లు ఇచ్చిన రూ.12.50 వేల కోట్లను కూడా డెమోక్రాట్లు వృధా చేశారని వెల్లడించింది. ఫెడరల్ ఎలక్షన్ కమీషన్ సంఘం ఇచ్చిన డేటా ఆధారంగా ఈ వివరాలు తెలిపినట్లు పేర్కొంది. ‘‘ఉబెర్ ఈట్స్ అండ్ డోర్ డాష్వంటి యాప్‌లకు రూ.12.50 లక్షలను డెమోక్రాట్లు చెల్లించారని.. అలాగే ఐస్ క్రీములకు రూ.7.5 లక్షలు ఖర్చుచేసినట్లు తెలిపింది.
ఇది కూడా చదవండి: Delhi: కాలుష్యం ఎఫెక్ట్.. ప్రభుత్వ కార్యాలయాల సమయాల మార్పు
కమలా హారిస్.. జూలై నుంచి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అప్పటి నుంచి కూడా ఆమె దుబారా ఖర్చులు చేసినట్లుగా ఎఫ్‌ఈసీ స్పష్టం చేసింది. ఆరిజోనా బోర్డ్ గేమ్ కఫే స్నేక్స్ అండ్ లాట్స్ కు రూ.5 లక్షలు ఖర్చు పెట్టారు. ప్రైవేటు జెట్లపై రూ.22 కోట్లు ఖర్చుచేశారు.‘‘దక్షిణ ఫ్లోరిడాకు చెందిన ప్రైవేట్ జెట్ సర్వీసెస్ గ్రూప్‌కు కమల బృందం రూ.18.50 కోట్లు, వర్జీనియాకు చెందిన అడ్వాన్స్‌డ్ ఏవియేషన్ టీమ్‌కి రూ.3.6 కోట్లు రుణపడి ఉంది” అని టెలిగ్రాఫ్ కథనంలో వివరించింది.
ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ జయకేతనం ఎగురవేశారు. కమలా హారిస్‌పై విజయం సాధించారు. ఇక ట్రంప్ భారీ విజయం నమోదు చేశారు. జనవరి 20న ట్రంప్ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.
ఇది కూడా చదవండి: Ram Charan In Kadapa: కడపలో కట్టలు తెంచుకున్న ‘మెగా’ అభిమానం