Gun Firing In Bar: మెక్సికోలోని ఆగ్నేయ ప్రాంతంలో గుర్తు తెలియనివారు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో 6 మంది మృతి చెందగా, మరో 5 మంది గాయపడ్డారు. హింసాత్మక సంఘటనలతో పోరాడుతున్న తీరప్రాంత ప్రావిన్స్ టబాస్కోలో ఈ కాల్పులు జరిగాయి. విల్లాహెర్మోసాలో కాల్పులు జరిగాయని పబ్లిక్ సెక్యూరిటీ సెక్రటరీ సోషల్ మీడియా పోస్ట్‌లో తెలిపారు. ఫెడరల్ అధికారులు ఈ అంశంపై దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి స్థానిక అధికారుల సహకారం తీసుకుంటున్నారు. Also Read:…
లండన్‌లో అమెరికా రాయబారి కార్యాలయం దగ్గర అనుమానాస్పద ప్యాకేజీ తీవ్ర కలకలం రేపింది. దీంతో యూకే పోలీసులు అప్రమత్తమై శుక్రవారం ప్యాకేజ్‌ను నిర్వీర్యం చేశారు. ప్యాకేజీ ఎక్కడినుంచి వచ్చిందనేదానిపై లండన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని అమెరికా ఎంబసీ వెల్లడించింది. మరోవైపు గాట్విక్ ఎయిర్‌పోర్టులో భద్రతాపరమైన ఘటన మరొకటి జరిగింది. దీంతో ఎయిర్‌పోర్టు దక్షిణ టెర్మినల్‌ను ఖాళీ చేయించామని అధికారులు తెలిపారు. ఇదిలాఉంటే రష్యా- ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం నేపథ్యంలో మాస్కో, అమెరికాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నాయి.…
అమెరికాలోని కాలిఫోర్నియా బీచ్‌లో ఒక అరుదైన చేపను రీసెర్చ్ స్కాలర్ కనుగొన్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను పీహెచ్డీ అభ్యర్థి షేర్ చేశాడు. ‘ఓర్ఫిష్’ లేదా ‘డూమ్స్‌డే ఫిష్’గా పిలిచే ఈ చేప చాలా అరుదైందిగా పేర్కొన్నాడు.
దేశీయ స్టాక్ మార్కె్ట్కు మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాలకు ముందు సరికొత్త జోష్ వచ్చింది. గత ఐదు నెలల్లో ఎన్నడూ చూడని విధంగా సూచీలు రాకెట్లా దూసుకుపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లోని సానుకూల సంకేతాలు మన మార్కెట్‌కు బాగా కలిసొచ్చాయి.
Kim Jong Un: ఉత్తర కొరియా అధినేత కిమ్ ప్యాంగ్యాంగ్లో నిర్వహించిన మిలటరీ ఎగ్జిబిషన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అగ్ర రాజ్యం అమెరికాపై సంచలన ఆరోపణలు చేశారు. కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలను పెంచుతోందన్నారు.
గౌతమ్ అదానీ.. భారతీయ, అమెరికా చట్టాలను ఉల్లంఘించినట్లు తెలుస్తుందన్నారు. మోడీ, అదానీ కలిసి ఉంటే.. ఆ ఇద్దరూ ఇండియాలో క్షేమంగా ఉంటారని ఆయన ఆరోపించారు. అదానీని తక్షణమే అరెస్ట్ చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.
ఉక్రెయిన్-రష్యా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రష్యాపై అమెరికా తయారీ క్షిపణులను ఉక్రెయిన్ ప్రయోగించింది. దీంతో రెండు దేశాల మధ్య టెన్షన్ వాతావరణం నెలకొంది.
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ త్వరలో బాధ్యతలు చేపట్టనున్నారు. జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. అయితే ఆయన ఇప్పటి నుంచే ప్రభుత్వ కూర్పు చేసుకుంటున్నారు.
బాంబ్ తుఫాన్ అగ్ర రాజ్యం అమెరికాను హడలెత్తిస్తోంది. అత్యంత శక్తివంతమైన సైక్లోన్ అనేక రాష్ట్రాలపై ప్రభావం చూపించనున్నట్లుగా తెలుస్తోంది. తీవ్రమైన గాలులు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.