Benjamin Netanyahu: ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య యుద్ధంతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈక్రమంలో ఇరాన్ జరిపిన దాడులకు ప్రతీకారంగా అణు, చమురు స్థావరాలపై దాడి చేయబోమని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వెల్లడించారు.
AR Rahman- Kamala Harris: నవంబర్ 5న అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. ఈ క్రమంలో ఆమెకు సపోర్టుగా ‘ద ఏషియన్ అమెరికన్ పసిఫిక్ ఐ లాండర్స్ (ఏఏపీఐ)’ నిధుల సేకరణ టీమ్ ఓ సభను ఏర్పాటు చేయబోతుంది. ఆ సభలో మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ కాన్సర్ట్ నిర్వహించనున్నారు.
Hurricane Milton: మిల్టన్ తుపాను ఉద్ధృతికి అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం పూర్తిగా అతలాకుతలమైంది. గురువారం సంభవించిన బలమైన సుడిగాలుల ధాటికి అక్కడి తీర ప్రాంతాల్లో తీవ్ర నష్టం జరిగింది.
America vs Iran: ఇరాన్- ఇజ్రాయెల్‌ల మధ్య యుద్ధంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తత కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో యూఎస్ కీలక ప్రకటన విడుదల చేసింది. ఇరాన్‌కు చెందిన పెట్రోలియం, పెట్రో కెమికల్ రంగాలపై తన ఆంక్షలను విస్తరించింది అమెరికా.
తాను అధికారంలోకి వస్తే భారత్ నుంచి దిగుమతి అయ్యే ప్రతి వస్తువులపై పన్నులు విధిస్తానని ఆయన వెల్లడించారు. ఇక, అమెరికా నుంచి దిగుమతి అవుతోన్న వస్తువులపై చైనా 200 శాతం సుంకం విధిస్తుంది.. బ్రెజిల్లో టారిఫ్‌లు కూడా అలాగే ఉన్నాయని డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు.
Israel-Hezbollah: ఇజ్రాయెల్- లెబనాల్‌ల మధ్య యుద్ధం నేపథ్యంలో పశ్చిమాసియాలో ఉద్రిక్తత కొనసాగుతుంది. తాజాగా, లెబనాన్‌లోని బీరుట్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో 22 మంది మృతి చెందగా.. మరో 117 మంది తీవ్రంగా గాయపడ్డారు అని లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వశాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
Pilot Heart Attack: సీటెల్ నుంచి ఇస్తాంబుల్ వెళ్లే టర్కిష్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం బుధవారం ఉదయం న్యూయార్క్‌లో పైలట్ చనిపోవడంతో అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. టర్కీ ఎయిర్‌లైన్స్ ప్రతినిధి యాహ్యా ఉస్తున్ విడుదల చేసిన ఒక ప్రకటనలో ఈ సమాచారం తెలిసింది. అధికారిక ప్రకటన ప్రకారం.., ఫ్లైట్ నంబర్ 204 పైలట్ 59 ఏళ్ల ఇల్చిన్ పెహ్లివాన్ మంగళవారం రాత్రి 7:02 గంటలకు సీటెల్ నుండి టేకాఫ్ తీసుకున్న తర్వాత మార్గమధ్యంలో అపస్మారక స్థితిలో…
ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో యుద్ధ వాతావరణం నెలకొంది. ఎప్పుడైనా భారీ విధ్వంసం జరిగే అవకాశం ఉంది. అనేక రంగాల్లో యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్‌కు విరామం లేదు. అయితే అమెరికా, అరబ్ దేశాలు కాల్పుల విరమణకు సంబంధించి ఇరాన్‌తో చర్చలు ప్రారంభించాయి. ఇజ్రాయెల్ నివేదిక ప్రకారం, మధ్యప్రాచ్యంలోని అన్ని రంగాలలో ఏకకాలంలో జరుగుతున్న యుద్ధాన్ని ఆపడానికి అమెరికా, అరబ్ దేశాలు ఇరాన్‌తో బ్యాక్‌డోర్ చర్చలు ప్రారంభించినట్లు తెలిసింది.
Threat Of Hurricane: అమెరికాలో మిల్టన్ హరికేన్ కారణంగా విధ్వంసం సంభవించే అవకాశం ఉంది. తుఫాను మంగళవారం ఫ్లోరిడాలోని టంపా బే తీరం వైపు దూసుకుపోతోంది. తుఫాను దృష్ట్యా, ఫ్లోరిడాలోని పరిపాలన తీర ప్రాంతాలను ఖాళీ చేయమని ప్రజలను ప్రభుత్వం ఆదేశించింది. 10 లక్షల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. హెలెన్ హరికేన్ విధ్వంసం సృష్టించిన రెండు వారాల తర్వాత భారీ తుఫాను వచ్చింది. హరికేన్ మిల్టన్ బుధవారం తీరాన్ని తాకవచ్చు. ఇది…