Donald Trump: యూఎస్ అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ జనవరిలో పదవి బాధ్యతలు చేపట్టనున్నారు. ఈక్రమంలో పెట్టుబడిదారుల కోసం ట్రంప్ భారీ ఆఫర్ ప్రకటించారు. అమెరికాలో 1 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టిన వారికి స్పీడ్ గా పర్మిషన్స్ మంజూరు చేయడంతో పాటు పర్యావరణ అనుమతులను కూడా వెంటనే ఇచ్చేస్తానని హామీ ఇచ్చారు.
బైడెన్ మాట్లాడుతూ.. 2020లో కరోనా మహమ్మారి విజృంభణ స్టార్టింగ్ లో బాధితులకు అందజేసిన రిలీఫ్ చెక్స్పై డొనాల్డ్ ట్రంప్ తన పేరు రాసుకుని మంచి పేరును సంపాదించుకున్నాడని ఆయన తెలిపారు. కానీ, ఆ మరుసటి ఏడాది అధ్యక్ష పదవి చేపట్టిన.. ట్రంప్ లాగా నేను చేయలేకపోయానని చెప్పుకొచ్చారుు. తానో ‘స్టుపిడ్’ అని అంటూ అతడు విచారం వ్యక్తం చేశారు.
సిరియాపై ఇజ్రాయెల్ డజన్ల కొద్దీ వైమానిక దాడులు నిర్వహించింది. సిరియా అంతటా క్షిపణులు ప్రయోగించింది. దీంతో బాంబు దాడులతో సిరియా దద్దరిల్లింది. తాజాగా సిరియా తిరుగుబాటుదారుల చేతుల్లోకి వెళ్లిపోయింది.
Donald Trump: ఓ టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. తాను అధ్యక్ష పదవి చేపట్టగానే అక్రమ వలసదారులు అందరినీ అమెరికా నుంచి తరిమేస్తానని వెల్లడించారు. అలాగే, చట్టబద్ధంగా వలస వచ్చేవారికి మార్గం మరింత సులువుగా చేస్తానని కాబోయే యూఎస్ అధ్యక్షుడు తెలిపారు.
భారత్ ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. అమెరికా, చైనా, జర్మనీ, జపాన్లు ముందున్నాయి. అయితే డిజిటల్ ఎగుమతుల విషయంలో భారత్ నాలుగో స్థానంలో ఉంది. ఈ జాబితాలో భారత్ కంటే అమెరికా, బ్రిటన్, ఐర్లాండ్ మాత్రమే ముందున్నాయి. ప్రపంచ వాణిజ్య సంస్థ ప్రకారం.. భారతదేశం 2023లో 257 బిలియన్ డాలర్ల విలువైన డిజిటల్ వస్తువులను ఎగుమతి చేస్తుంది. భారతదేశ డిజిటల్ ఎగుమతులు 2022 సంవత్సరంలో 17 శాతం పెరిగాయి.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరి కొద్ది రోజుల్లో అధ్యక్ష పదవిని వదులుకోనున్నారు. గతంలో అక్రమంగా తుపాకీ కలిగి ఉండటం, పన్ను ఎగవేత కేసులో ఆయన తన కుమారుడికి క్షమాభిక్ష ప్రసాదించారు. తన కొడుకు క్షమాపణ కోసం అధ్యక్ష పదవిని ఉపయోగించబోనని ఇచ్చిన హామీపై యూటర్న్ తీసుకున్నారు. ఇది మాత్రమే కాదు.. ఈ క్షమాపణ నేరానికి శిక్ష పడకుండా హంటర్ను కాపాడుతుంది.
అగ్ర రాజ్యం అమెరికాలో భారతీయుల భద్రత ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి వరుసగా భారతీయుల హతం అవుతున్నారు. ఆ మధ్య హైదరాబాద్కు చెందిన విద్యార్థిని దుండగులు కిడ్నాప్ చేసి హతమార్చారు.
ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య జరుగుతున్న యుద్ధానికి ముగింపు పడింది. గత కొద్ది రోజులుగా యుద్ధంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలతో అట్టుడికాయి. క్షిపణి, బాంబు దాడులతో రెండు దేశాలు దద్దరిల్లాయి. మొత్తానికి అమెరికా జోక్యంతో కాల్పులకు ఫుల్స్టాప్ పడింది.
Donald Trump: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ తన ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో వైద్య పరిశోధనలను పర్యవేక్షించే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్కు తదుపరి డైరెక్టర్గా భారతీయ మూలాలున్న జై భట్టాచార్యను ఎంపిక చేశారు.