TikTok: భారత్‌లోకి మళ్లీ టిక్‌టాక్ ప్రవేశం?
- మస్క్ చేతుల్లోకి టిక్‌టాక్?
- భారత్‌లో ఈ యాప్‌పై గతంలో నిషేధం
- మస్క్ చేతుల్లోకి వస్తే భారత్‌లోకి టిక్‌టాక్ ప్రవేశించే అవకాశం?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత సార్వభౌమాధికారం, సమగ్రత, శాంతిభద్రతలకు భంగం కలిగించే విధంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయంటూ టిక్‌టాక్, షేరిట్ సహా 59 యాప్‌లను నిషేధిస్తూ కేంద్ర సమాచార, సాంకేతిక మంత్రిత్వ శాఖ 2020లో ఉత్తర్వులు జారీ చేసింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2009 లోని 69వ సెక్షన్ ప్రకారం ఈ ఉత్తర్వులు జారీచేస్తున్నట్లు జూన్ 29, 2020 ఒక ప్రకటనలో తెలిపింది. లద్దాఖ్‌లోని గాల్వన్ లోయలో భారత్, చైనాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల తర్వాత భారత్ ఈ నిర్ణయం తీసుకుంది. భారత ప్రభుత్వం నిషేధించిన 59 యాప్‌ల జాబితాలో టిక్‌టాక్, యూసీ బ్రౌజర్, బైడూ మ్యాప్, షేరిట్ వంటి చైనా యాప్‌లు అధికంగా ఉన్నాయి. కాగా.. భారత్‌లో టిక్‌టాక్, హలోల నిషేధం తర్వాత వాటి మాతృ సంస్థ బైట్‌డాన్స్ భారీ నష్టాన్ని మూటగట్టుకోనున్నట్లు తెలుస్తోంది. చైనా అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ కథనం ప్రకారం.. భారత్‌లో నిషేధం తర్వాత బైట్‌డాన్స్ 6 బిలియన్ డాలర్లు (రూ.45 వేల కోట్లు) నష్టపోయిందని సమాచారం.
READ MORE: PM Modi: దేశ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ
Also Read
- Redmi K200 Series: Redmi K200 సిరీస్‌లో 7 ఇంచుల 2K డిస్‌ప్లే?.. హై రిఫ్రెష్ రేట్‌తో రానున్న కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లు!
- Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
- Jio AI Glasses: కళ్లజోడుతోనే UPI పేమెంట్స్.. లైవ్ క్రికెట్ కామెంటరీ కూడా!
- 3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
కాగా.. ఇటీవల అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. మరి కొన్ని రోజుల్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. చైనాకు వ్యతిరేకంగా కఠిన వైఖరి అవలంబించడంపై ట్రంప్ పలు సందర్భాల్లో మాట్లాడారు. దీని తర్వాత, టిక్‌టాక్‌పై నిషేధంపై ఊహాగానాలు తీవ్రమయ్యాయి. ఇప్పటికే యూఎస్ చట్టసభ సభ్యులు ఈ యాప్ గురించి ఆందోళన వ్యక్తం చేశారు. యూఎస్ కాంగ్రెస్ మాత్రం గత సంవత్సరం నిషేధానికి అనుకూలంగా ఓటు వేసింది. ఇప్పటికే టిక్‌టాక్ మాతృ సంస్థ బైట్‌డాన్స్ యూఎస్ సుప్రీం కోర్ట్‌లో టిక్‌టాక్ నిషేధాన్ని సవాలు చేసింది. యుఎస్‌లో నిషేధాన్ని నివారించడంలో టిక్‌టాక్ విఫలమైతే, దానిని మస్క్‌కు అప్పగించవచ్చని బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. యూఎస్ జనాభాలో దాదాపు సగం మంది టిక్‌టాక్‌ని ఉపయోగిస్తున్నారు. దాదాపు 170 మిలియన్ల మంది ప్రజలు దీనిని వాడుతున్నారు. అయితే.. ఇప్పటి వరకు టిక్‌టాక్ యాప్ చైనాకు చెందిన బైట్‌డాన్స్ చేతుల్లో ఉంది. ఒక వేళ చైనాకు టిక్‌టాక్‌ను అమ్మితే.. భారత్‌లో తిరిగి ప్రారంభించే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే.. ప్రస్తుతం భారత్-అమెరికా మధ్య ఎలాంటి ఆటంకాలు లేవు.. ఇరు దేశాలు సమన్వయంతో ముందుకు సాగుతున్నాయి.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!