US: జిమ్మీ కార్టర్ అంత్యక్రియల్లో ప్రముఖులు గుసగుసలు, నవ్వులు.. వీడియో వైరల్
- అమెరికా మాజీ జిమ్మీ కార్టర్ అంత్యక్రియల్లో ప్రముఖులు గుసగుసలు, నవ్వులు
- సోషల్ మీడియాలో వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ అంత్యక్రియల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. వాషింగ్టన్ నేషనల్ కేథడ్రల్ చర్చిలో జరిగిన ప్రార్థనా కార్యక్రమాల్లో అధ్యక్షుడు బైడెన్ దంపతుల సహా.. కాబోయే అధ్యక్షుడు ట్రంప్ దంపతులు, మాజీ అధ్యక్షుల కుటుంబాలు హాజరయ్యారు. అయితే ఆద్యంతం అందరూ గుసగుసలాడుకోవడం.. ముసిముసి నవ్వులతో కనిపించారు. ఇక కాబోయే అధ్యక్షుడు ట్రంప్-మాజీ అధ్యక్షుడు ఒబామా అయితే చాలా సేపు నవ్వుతూ మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also Read
సహజంగా అంత్యక్రయల సమయంలో ఎవరూ నవ్వుకోరు. బాధతోనో.. లేదంటే మౌనంగానో ఉంటారు. కానీ ఆశ్చర్యమేంటంటే.. ప్రార్థన జరుగుతున్న సమయంలో ప్రముఖలంతా మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఒబామా-ట్రంప్ మాట్లాడుకుంటుండగా అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ఓ లుక్ వేసి వెంటనే తిరిగి పోయారు. అంతకముందు కమలా హారిస్ దంపతులు కూడా నవ్వుతూ కనిపించారు. ఈ అంత్యక్రియలకు హాజరైన మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా, జార్జ్ డబ్ల్యూ. బుష్, బిల్ క్లింటన్ దంపతులు కూడా మాట్లాడుకుంటూనే ఉన్నారు.

ఇదిలా ఉంటే ఈ కార్యక్రమానికి హాజరైన ప్రస్తుత అధ్యక్ష, ఉపాధ్యక్ష దంపతులతో పాటు మాజీ అధ్యక్షులు హాజరయ్యారు. వారందరూ ఒకేచోట ఆసీనులయ్యారు. ఈ క్రమంలో డొనాల్డ్ ట్రంప్ పక్కనే బరాక్ ఒబామా కూర్చున్నారు. కొంత సమయానికి వీరిద్దరి మధ్య సంభాషణ మొదలైంది.
NEW: Donald Trump seen cracking jokes with former President Barack Obama at Jimmy Carter’s funeral in Washington D.C.
Kamala Harris was seen looking back as the two men appeared to be getting along. pic.twitter.com/dHrB2m7GZi
— Collin Rugg (@CollinRugg) January 9, 2025
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?