రష్యా-ఉక్రెయిన్ మధ్య రెండేళ్లకు పైగా యుద్ధం సాగుతోంది. ఇప్పటికీ రెండు దేశాల మధ్య తీవ్ర పోరు నడుస్తోంది. రష్యా జరిపిన భీకరదాడుల్లో ఉక్రెయిన్ చాలా నష్టపోయింది. తాజాగా ఉక్రెయిన్ కూడా అంతే ధీటుగా దాడులను ఎదుర్కొంటోంది. దీనికి అమెరికానే ప్రధాన కారణం. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. ఉక్రెయిన్‌కు భారీగా ఆయుధాలు సరఫరా చేస్తున్నారు. అమెరికా సాయంతో ఉక్రెయిన్ కూడా రష్యాపై మెరుపు దాడులు చేస్తోంది. అయితే జో బైడెన్ మరికొద్ది రోజుల్లో అమెరికా అధ్యక్ష పదవి నుంచి దిగిపోనున్నారు. కొత్త అధ్యక్షుడిగా జనవరి 20న డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించనున్నారు. అయితే బైడెన్ పదవి నుంచి దిగిపోయేలోపు.. రష్యాకు గట్టి షాక్ ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: Bhadrachalam: సాయంత్రం హంస వాహనంపై విహరించనున్న సీతా రామచంద్రస్వామి..
త్వరలో అమెరికాలో అధికార మార్పిడి జరగనుంది. ఇంకో పది రోజుల్లో బైడెన్ శకం ముగుస్తుంది. ట్రంప్ శకం ప్రారంభం కానుంది. అయితే ఈలోపే రష్యాకు భారీ షాక్ ఇచ్చేందుకు బైడెన్ సిద్ధమయ్యారు. రష్యా ఆర్థిక మూలాలను దెబ్బ తీయడమే కాకుండా.. ఉక్రెయిన్‌కు భారీగా ఆయుధాలు సరఫరా చేసేందుకు బైడెన్ రెడీ అయ్యారు. రష్యా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేందుకు కొత్త ఆంక్షలు విధించబోతున్నట్లు యూఎస్ అధికారి ఒకరు తెలిపారు. యుద్ధానికి కావాల్సిన బలమైన ఆయుధాలను ఉక్రెయిన్‌కు అందించాలని బైడెన్ భావిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. అంతేకాకుండా బైడెన్ పదవి నుంచి దిగేలోపు కూడా.. రష్యాపై భారీ దాడులు చేసేందుకు కూడా ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: AP Pensions: కొనసాగుతోన్న పెన్షన్ల వెరిఫికేషన్… ఆ తర్వాతే తొలగింపు..!
ఇదిలా ఉంటే గురువారం ఉక్రెయిన్ కోసం $ 500 మిలియన్ల కొత్త సైనిక సహాయాన్ని అందించేందుకు బైడెన్ అడ్మినిస్ట్రేషన్ సిద్ధం చేస్తోంది. ఇందులో వాయు రక్షణ క్షిపణులు, ఎయిర్-టు- గ్రౌండ్ మందుగుండు సామగ్రి, F-16 ఫైటర్ జెట్లు అందించేందుకు సిద్ధపడింది. ఉక్రెయిన్‌కు ఇస్తామన్న ఆయుధాలు పంపిణీ చేశామని.. కొన్ని చేరుకున్నాయి.. మరికొన్ని మార్గంలో ఉన్నట్లు యూఎస్ అధికారి తెలిపారు.
ఇది కూడా చదవండి: Ghaati : అనుష్క కోసం రంగంలోకి దిగనున్న ప్రభాస్