Los Angeles Wildfires: లాస్ ఏంజెలెస్‌లో గల హాలీవుడ్‌లోని ఐకానిక్ నిర్మాణాలను కార్చిచ్చు కాల్చి బూడిద చేసే ప్రమాదం ఉంది. ఆస్కార్ అవార్డులు ప్రదానం చేసే ప్రఖ్యాత డాల్బీ థియేటర్‌ను కూడా అగ్నిమాపక శాఖ అధికారులు ఖాళీ చేయించారు. దీంతో ప్రస్తుతం పరిస్థితితో ఆస్కార్ నామినేషన్ ప్రక్రియ ఆలస్యం అయ్యే ప్రమాదం ఉంది. నేడు (జనవరి 9) హాలీవుడ్‌లో సరికొత్త కార్చిచ్చు పుట్టిందని పేర్కొన్నారు. ఇది అత్యంత వేగంగా వ్యాపిస్తుండటంతో హాలీవుడ్ హిల్స్ మొత్తాన్నీ ఖాళీ చేయిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది సినీతారల ఇళ్లు, సంపదను కోల్పోయారు. మొత్తంగా 1100 నిర్మాణాలు దగ్ధమైనట్లు తేలింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. దాదాపు 1.3 లక్షల ఇళ్లు ఖాళీ చేయించారు.
Read Also: Bhumana Karunakara Reddy: తొక్కిసలాట ఘటనపై టీటీడీ మజీ ఛైర్మన్ రియాక్షన్..
అయితే, ఇప్పటి వరకు మొత్తం ఆరు చోట్ల ఈ కార్చిచ్చులు వ్యాపించినట్లు ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు ప్రకటించారు. ఈ మంటల్లో 15,800 ఎకరాలు కాలిబూడిద కాగా, పాలిసాడ్స్ ఫైర్ అతి పెద్దది అన్నారు. దీని తర్వాత ఈటన్‌లో 10 వేల ఎకరాలు దగ్ధం అయింది. ఆల్టడేన, పసాడెనా ప్రాంతాల్లో కొనసాగుతుంది. ఇక, సన్‌సెట్ ఫైర్ వేగంగా హాలీవుడ్ హిల్స్‌ను చుట్టుముట్టింది. సైల్మర్ ప్రాంతంలో 700 ఎకరాలను హురెస్ట్ ఫైర్ కాల్చి బూడిద చేసింది. మరో 340 ఎకరాలను లిడియా ఫైర్ కాల్చేసింది. ఇక, ఉడ్లీ ఫైర్‌ను అధికారులు క్రమంగా నియంత్రించారు.
Read Also: Tirupati Collector: అన్ని ఏర్పాట్లు చేశాం.. కానీ..
కాగా, లాస్ ఎంజెలెస్ సంపన్న ప్రాంతం కావడంతో భారీ నష్టం వాటిల్లింది. ఇప్పటి వరకు వచ్చిన ప్రాథమిక అంచనాల ప్రకారమే 50 బిలియన్ డాలర్ల సంపద నాశనం అయింది. ఇది మరింత పెరిగే అవకాశం ఉందని టాక్. అయితే, ఇప్పటి వరకు అగ్ని కీలలను తాము అదుపు చేయలేకపోయామని అగ్నిమాపక శాఖ చీఫ్ క్రిస్టన్ క్రౌలీ తెలిపారు. 1700 మంది సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. మరో 7,500 మంది సిబ్బందిని కాలిఫోర్నియా రెడీ చేస్తుందన్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇటలీ, రోమ్‌లలో టూరు ఉంది. తన పదవీకాలంలో చివరిదైన ఈ విదేశీ పర్యటనను క్యాన్సిల్ చేసుకున్నట్లు వైట్ హౌస్ ప్రకటించింది. ఆయన లాస్‌ఏంజెలెస్‌లో ఈ కార్చిచ్చు పరిస్థితిని ప్రత్యక్షంగా సమీక్షిస్తున్నారని వెల్లడించింది.