Justin Trudeau: యూఎస్ కు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కెనడాను “51వ అమెరికా రాష్ట్రం”గా మార్చాలనే ఆలోచనను పదేపదే తెరపైకి తీసుకొచ్చాడు. కెనడాను యూఎస్ నియంత్రణలోకి తీసుకురావడానికి ఆర్థికంగా ఒత్తిడి పెట్టారు. కానీ, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో అలాంటి అవకాశమే లేదని పేర్కొన్నాడు. ఈ రెండు దేశాల్లోని కార్మికులు, పరిశ్రమలు ఒకరికొకరు సహాయం చేసుకోవడం వల్ల అతి పెద్ద వాణిజ్యం- భద్రతా భాగస్వామిగా ఉండటంతో ప్రయోజనం పొందుతాయని చెప్పారు.
Read Also: Bomb Threat: ఢిల్లీలో స్కూల్స్కు బాంబు బెదిరింపు.. 12వ తరగతి విద్యార్థి అరెస్ట్!
అయితే, మరోవైపు.. కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిల్స్ హాలీవుడ్ హిల్స్ లో కార్చిచ్చు కొనసాగుతుంది. దీంతో ఇప్పటికే వేల సంఖ్యలో ఇళ్లు, కార్లు దగ్ధం కాగా.. కోట్ల సంపద అగ్నికి ఆహుతి అయింది. లాస్ ఏంజిల్స్ కౌంటీలో మంటలు చెలరేగడంతో వాటిని ఆర్పేందుకు కెనడియన్ వాటర్‌బాంబర్లను ప్రధాని జస్టిన్ ట్రూడో పంపించారు. ఇప్పటికే 250 మంది అగ్నిమాపక సిబ్బందిని మోహరించినట్లు ఆయన పేర్కొన్నాడు. ఈ విషయాన్ని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పోస్ట్ చేస్తూ.. పొరుగువారికి సహాయం చేయడానికి కెనడా ఇక్కడ ఉంది అని బ్రిటిష్- అమెరికన్ స్పెల్లింగ్‌లను జస్టిన్ ట్రూడో ఉపయోగించడంతో రెండు (కెనడ- అమెరికా) దేశాల మధ్య వ్యత్యాసాలను తెలియజేశాడు.
Neighbours helping neighbors. 🇨🇦🇺🇸pic.twitter.com/qRuEsu31T0
— Justin Trudeau (@JustinTrudeau) January 9, 2025
Canada is mobilizing to help fight the wildfires in southern California. Canadian water bombers are already in action. 250 firefighters are ready to deploy. The @CanadianForces are standing by to move personnel and equipment.
To our American neighbours: Canada's here to help.
— Justin Trudeau (@JustinTrudeau) January 9, 2025