అమెరికాతో పాత సంబంధం ముగిసిందని కెనడా ప్రధాని మార్క్ కార్నీ తెలిపారు. కెనడాపై అమెరికా అధిక సుంకాలను విధించిన నేపథ్యంలో కార్నీ ఈ విధంగా స్పందించారు. అమెరికాతో ఆర్థిక, భద్రతా, సైనిక సంబంధాలు మొత్తం ముగిసినట్లుగా పేర్కొన్నారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల ప్రక్రియపై భారీ మార్పులు చేస్తూ ఒక కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. ఇకపై ఓటరు నమోదు కోసం పౌరసత్వానికి సంబంధించిన ధ్రువపత్రాన్ని తప్పనిసరి చేశారు. అంతేకాకుండా అమెరికాయేతర పౌరులు విరాళం ఇవ్వకుండా నిషేధం విధించింది.
నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్‌కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బహుమానం ప్రకటించారు. ఓవర్‌టైమ్ జీతాన్ని తానే చెల్లిస్తానని ట్రంప్ ప్రకటించారు. విలేకర్ల సమావేశంలో ట్రంప్‌ను అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. తాను చేయాల్సి వస్తే.. తన జేబు నుంచి వారికి ఓవర్‌టైమ్ జీతం చెల్లిస్తానని తెలిపారు.
టెస్లా ఆస్తులపై దాడులు చేస్తే ఖబడ్దార్ అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఎవరైనా టెస్లా ఆస్తులపై దాడుల చేస్తే 20 ఏళ్లు జైలు శిక్ష విధిస్తామని హెచ్చరించారు. ఇటీవల టెస్లా కార్ల షోరూమ్‌కి నిప్పుపెట్టారు. పలు కార్లు దగ్ధమయ్యాయి. ఇది ఉగ్ర చర్యగా టెస్లా అధినేత ఎలోన్ మస్క్ ఆరోపించారు.
టెస్లా కార్ల సంస్థకు అమెరికాలో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా షోరూమ్‌కి దుండగులు నిప్పుపెట్టారు. దీంతో ఈ ఘటనలో పలు కార్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. భారీ అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. రంగంలోకి దిగిన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది.. మంటలను అదుపు చేశారు.
వైట్‌హౌస్‌లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్-ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మధ్య తీవ్రమైన వాగ్యుద్ధం నడిచింది. రష్యాతో యుద్ధం, అలాగే ఖనిజ ఒప్పందాలపై ఇరువురి మధ్య మాటల యుద్ధం నడిచింది.
Britain- Ukraine: అమెరికా పర్యటనను అర్ధంతరంగా క్లోజ్ చేసుకుని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ షెడ్యూల్ కంటే ఒక రోజు ముందుగా మార్చ్ 1వ తేదీన బ్రిటన్ కు వెళ్లారు. యూకే ప్రధాని కీర్ స్టార్మర్ తన అధికార నివాసం 10, డౌనింగ్ స్ట్రీట్ దగ్గర ఆయనకు ఘన స్వాగతం పలికారు.
వైట్‌హౌస్ వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తీవ్ర వాగ్యుద్ధానికి దిగారు. ఇందుకు ప్రపంచ మీడియా వేదిక అయింది. శాంతి చర్చలు సందర్భంగా ట్రంప్-జెలెన్ స్కీ మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం నడిచింది.
అమెరికాలో జరిగిన రోడ్డుప్రమాదంలో భారతీయ విద్యార్థిని నీలం షిండే (35) పరిస్థితి విషమంగా ఉంది. ఈనెల 14న ఆమె ప్రయాణించిన కారు ప్రమాదానికి గురైంది. అప్పటి నుంచి ఆమె ఐసీయూలో ఉంది.
అమెరికాలో మరో ఘోర విమాన ప్రమాదం తప్పింది. మంగళవారం ఉదయం 8:50 గంటలకు చికాగో మిడ్వే అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒకే రన్‌వేపైకి రెండు విమానాలు ఒకేసారి వచ్చేశాయి.