Pahalgam Terror Attack: పాక్-భారత్ ఉద్రిక్తతలపై అమెరికా కీలక సూచన
- పాక్-భారత్ ఉద్రిక్తతలపై అమెరికా కీలక సూచన
- బాధ్యతాయుతమైన పరిష్కారం కోసం కృషి చేయాలని విజ్ఞప్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత పాకిస్థాన్-భారత్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. ఎల్‌ఓసీ దగ్గర నిరంతరం కాల్పులకు తెగబడుతోంది. ఇక యూకేలో అయితే పాక్ అధికారి పీక కోస్తానంటూ భారతీయులను బెదిరించాడు. ఇక భారత్ కూడా కఠిన నిర్ణయాలు తీసుకుంది. పాక్‌కు సింధు జలాలను నిలిపివేసింది. అలాగే వీసాలను రద్దు చేసింది. అటారీ సరిహద్దు మూసేసింది.
తాజాగా ఇరు దేశాల ఉద్రిక్తలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత ఇరు దేశాల మధ్య నెలకొన్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. బాధ్యతాయుతమైన పరిష్కారం కోసం కృషి చేయాలని అమెరికా విదేశాంగ శాఖ విజ్ఞప్తి చేసింది. ఈ విషయంలో భారత్‌కు వాషింగ్టన్ అండగా ఉంటుందని స్పష్టం చేసింది.
Also Read
- Nepal Floods: నేపాల్ వరదలు.. కొట్టుకొచ్చిన బంగారం, వెండి, డబ్బులు..
- Nepal Floods: 90 నిమిషాల్లో నేపాల్‌కు పెను ముప్పు.. మరో సరస్సు బద్ధలయ్యే ఛాన్స్..
- China Earthquake: చైనాలో భారీ భూకంపం.. సిచువాన్‌లో 5.1 తీవ్రతతో ప్రకంపనలు, నేపాల్‌లో మరోసారి వరద భయం!
- Nepal Floods: విషాదం వేళ అమానవీయం.. మృతదేహాలపై ఆభరణాలు చోరీ
ఇటీవల పోప్ అంత్యక్రియలకు రోమ్ వెళ్తూ ట్రంప్ కూడా స్పందించారు. పహల్గామ్ ఉగ్ర దాడి చెత్త పని అని పేర్కొన్నారు. కాశ్మీర్ సమస్యను భారత్-పాక్ పరిష్కరించుకుంటాయని పేర్కొన్నారు.
ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాక్‌తో భారత్ సంబంధాలు దెబ్బతిన్నాయి. భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంది. సింధు జలాలు నిలిపివేసింది. అంతేకాకుండా పాకిస్థానీయుల వీసాలను రద్దు చేసింది. అలాగే అటారీ సరిహద్దు మూసివేసింది. ఇలా ఒక్కొక్కటిగా భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ఇక ఉగ్ర దాడులకు పాల్పడ్డ నిందితుల సమాచారం అందిస్తే రూ.20లక్షల రివార్డ్ ప్రకటించింది. గత మంగళవారం జరిగిన ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. పదుల కొద్ది గాయపడ్డారు. మృతుల్లో ఎక్కువగా కొత్తగా పెళ్లైన వారు ఉండడం బాధాకరం.
తాజావార్తలు
-
Irumudi: మాస్ మహారాజా రవితేజ ఊచకోత.. 135 కోట్లతో ‘ఇరుముడి’ ఫస్ట్ వీక్ సెన్సేషన్!
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Nepal Floods: నేపాల్ వరదలు.. కొట్టుకొచ్చిన బంగారం, వెండి, డబ్బులు..
-
Nepal Floods: 90 నిమిషాల్లో నేపాల్‌కు పెను ముప్పు.. మరో సరస్సు బద్ధలయ్యే ఛాన్స్..
-
Raviteja: ‘ఇరుముడి’ విధ్వంసం.. వివేక్ ఆత్రేయతో మాస్ మహారాజా క్రేజీ ప్రాజెక్ట్ ఖరారు!
ట్రెండింగ్
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!
-
5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్‌కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!