America : అమెరికాలో (యుఎస్) భారతీయ పౌరుడు అయిన సాయి కందుల వైట్ హౌస్ పై దాడి చేసినందుకు ఎనిమిదేళ్లు జైలు శిక్ష విధించబడింది. నిందితుడు కోర్టులో తన నేరాన్ని అంగీకరించాడు.
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, మిచెల్ దంపతులు విడిపోతున్నారంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి. సోషల్ మీడియా వేదికగా తీవ్ర చర్చ సాగుతోంది. ఇద్దరూ కూడా గత కొంత కాలంగా విడివిడిగా ఉంటున్నారని సమాచారం.
Donald Trump: అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి గెలిచిన డొనాల్డ్ ట్రంప్ జనవరి 20వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి బిలియనీర్లు, టెక్ దిగ్గజాలు ఎలాన్‌మస్క్, మార్క్ జుకర్‌బర్గ్, జెఫ్ బెజోస్ హాజరవుతారని పేర్కొన్నారు.
భారత సార్వభౌమాధికారం, సమగ్రత, శాంతిభద్రతలకు భంగం కలిగించే విధంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయంటూ టిక్‌టాక్, షేరిట్ సహా 59 యాప్‌లను నిషేధిస్తూ కేంద్ర సమాచార, సాంకేతిక మంత్రిత్వ శాఖ 2020లో ఉత్తర్వులు జారీ చేసింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2009 లోని 69వ సెక్షన్ ప్రకారం ఈ ఉత్తర్వులు జారీచేస్తున్నట్లు జూన్ 29, 2020 ఒక ప్రకటనలో తెలిపింది. లద్దాఖ్‌లోని గాల్వన్ లోయలో భారత్, చైనాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల తర్వాత భారత్ ఈ నిర్ణయం తీసుకుంది.…
భారత్ వంటి దేశాల్లో నిషేధాన్ని ఎదుర్కొన్న తర్వాత అమెరికాలో కూడా టిక్‌టాక్ '(TikTok)పై వేటు పడే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితిలో చైనా టిక్‌టాక్ భవిష్యత్తు కోసం ప్లాన్ చేస్తోంది. పలు అంతర్జాతీయ వార్తా సంస్థల నివేదికల ప్రకారం.. చైనా టెస్లా సీఈవో ఎలాన్ మస్క్‌కి టిక్ టాక్ ను విక్రయించేందుకు సిద్ధమవుతోంది. యుఎస్‌లో నిషేధాన్ని నివారించడంలో టిక్‌టాక్ విఫలమైతే, దానిని మస్క్‌కు అప్పగించవచ్చని బ్లూమ్‌బెర్గ్ నివేదించింది.
అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ అంత్యక్రియల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. వాషింగ్టన్ నేషనల్ కేథడ్రల్ చర్చిలో జరిగిన ప్రార్థనా కార్యక్రమాల్లో అధ్యక్షుడు బైడెన్ దంపతుల సహా.. కాబోయే అధ్యక్షుడు ట్రంప్ దంపతులు, మాజీ అధ్యక్షుల కుటుంబాలు హాజరయ్యారు.
కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిల్స్ హాలీవుడ్ హిల్స్ లో కార్చిచ్చు కొనసాగుతుంది. దీంతో ఇప్పటికే వేల సంఖ్యలో ఇళ్లు, కార్లు దగ్ధం కాగా.. కోట్ల సంపద అగ్నికి ఆహుతి అయింది. లాస్ ఏంజిల్స్ కౌంటీలో మంటలు చెలరేగడంతో వాటిని ఆర్పేందుకు కెనడియన్ వాటర్బాంబర్లను ప్రధాని జస్టిన్ ట్రూడో పంపించారు.
ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ రియాక్ట్ అయ్యారు. మస్క్ లెఫ్ట్ వింగ్ కాకపోవడం వల్లే ఆ దేశాలన్నీ ఆయనపై మండిపడుతున్నాయన్నారు. పలు సందర్భాల్లో ఇటలీ, ఇతర దేశాధినేతలు తమ దేశ రాజకీయాల్లోనూ జోక్యం చేసుకున్నారని తెలిపింది.
రష్యా-ఉక్రెయిన్ మధ్య రెండేళ్లకు పైగా యుద్ధం సాగుతోంది. ఇప్పటికీ రెండు దేశాల మధ్య తీవ్ర పోరు నడుస్తోంది. రష్యా జరిపిన భీకరదాడుల్లో ఉక్రెయిన్ చాలా నష్టపోయింది. తాజాగా ఉక్రెయిన్ కూడా అంతే ధీటుగా దాడులను ఎదుర్కొంటోంది.
Los Angeles Wildfires: లాస్ ఏంజెలెస్‌లో గల హాలీవుడ్‌లోని ఐకానిక్ నిర్మాణాలను కార్చిచ్చు కాల్చి బూడిద చేసే ప్రమాదం ఉంది. ఆస్కార్ అవార్డులు ప్రదానం చేసే ప్రఖ్యాత డాల్బీ థియేటర్‌ను కూడా అగ్నిమాపక శాఖ అధికారులు ఖాళీ చేయించారు. దీంతో ప్రస్తుతం పరిస్థితితో ఆస్కార్ నామినేషన్ ప్రక్రియ ఆలస్యం అయ్యే ప్రమాదం ఉంది.