IND PAK War: భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయని ప్రకటించారు. ఆయన ఈ ప్రకటనను తన సోషల్ మీడియా వేదిక ద్వారా వెల్లడించారు. అలాగే, ట్రంప్ ప్రకటన వెలువడిన కొన్ని నిమిషాల్లోనే భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి ఈ విషయాన్ని ధృవీకరించారు. రెండు దేశాల సైనిక ఆపరేషన్ల డైరెక్టర్లు మధ్య మే 10వ తేదీ సాయంత్రం 3:35 గంటలకు మాట్లాడారు. భూమి, సముద్రం, గగన మార్గాల్లో అన్ని రకాల దాడులను ఆపేందుకు వారు అంగీకరించారని తెలిపారు. తదుపరి చర్చలు మే 12న జరగనున్నాయని ఆయన తెలిపారు.
Read Also: IND PAK War: తక్షణమే కాల్పుల విరమణకు అంగీకరించాం: పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్
ఇది జఇలా ఉండగా.. ఒక రోజు క్రితం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మీడియాతో మాట్లాడుతూ.. ఇండియా-పాకిస్తాన్ మధ్య యుద్ధం మనకు సంబంధం లేనిదని అన్నారు. మేము వారి మధ్య జరిగే విషయాలలో జోక్యం చేసుకోము అంటూ వ్యాఖ్యానించారు. అయితే, ట్రంప్ ప్రకటన వెలువడిన అనంతరం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఈ సందర్బంగా మరోమారు వాన్స్ మాట్లాడుతూ.. మన బాధ్యత మైత్రి పూర్వకంగా చర్చలు జరిపేలా ప్రోత్సహించడం మాత్రమే. అమెరికా భారతదేశానికి దాడులు ఆపమని చెప్పాము. అలాగే పాకిస్తాన్‌కూ అదే చెప్పాము. మేము ఈ అంశాన్ని డిప్లొమాటిక్ మార్గాల ద్వారానే పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నాం అని ఆయన అన్నారు. ఈ పరిస్థితి చూస్తుంటే ముందు జరగబోయే మీటింగ్స్ లో ఎలాంటి మార్పులు జరుగుతాయో అని ప్రశ్నార్థకంగా మారింది.