US: హార్వర్డ్ యూనివర్సిటీ సంచలన నిర్ణయం.. ట్రంప్ సర్కార్‌పై దావా
- హార్వర్డ్ యూనివర్సిటీ సంచలన నిర్ణయం
- ట్రంప్ సర్కార్‌పై దావా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అగ్ర రాజ్యం అమెరికాలో హార్వర్డ్ యూనివర్సిటీ-ట్రంప్ ప్రభుత్వం మధ్య తీవ్ర పోరాటం జరుగుతోంది. హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి 2.2 బిలియన్ డాలర్ల నిధులను ట్రంప్ సర్కార్ నిలిపివేసింది. అంతేకాకుండా యూనివర్సిటీకి కల్పించే పన్ను మినహాయింపును కూడా నిలిపివేసింది. దీంతో హార్వర్డ్ యూనివర్సిటీ.. ట్రంప్ సర్కార్‌పై ప్రత్యక్ష పోరాటానికి దిగింది. ట్రంప్ పరిపాలనపై యూనివర్సిటీ దావా వేసింది. ప్రభుత్వం బెదిరించి నిధులను నిలిపివేసిందని పేర్కొంది. యూనివర్సిటీ ప్రతిష్టతను ట్రంప్ సర్కార్ దెబ్బతీస్తుందని.. అంతేకాకుండా విదేశీ విద్యార్థులను కూడా బెదిరిస్తోందని దావాలో వాపోయింది. ఈ మేరకు మసాచుసెట్స్ ఫెడరల్ కోర్టులో దావా వేసింది.
ఇది కూడా చదవండి: Inter Results: నేడు ఇంటర్ ఫలితాలు.. తల్లిదండ్రులూ.. మీ పిల్లలు జాగ్రత్త?
Also Read
- India-Pakistan: పాక్ గడ్డపై భారత అధికారులు.. ఇస్లామాబాద్‌లో మొదలైన హై-వోల్టేజ్ మీటింగ్! అసలు ఏం జరుగుతోంది?
- Nepal Floods: నేపాల్‌లో జల ప్రళయం.. విరిగిపడ్డ కొండచరియలు.. మూడు రోజుల్లో ఎంత మంది చనిపోయారంటే!
- Indian Navy: సముద్ర రక్షణకు భారతే రథసారథి.. 6 అగ్రదేశాలతో కలిసి భారత నౌకాదళం గర్జన!
- Trump Iran Statement: ‘త్వరలోనే విజయం సాధిస్తాం’.. ఇరాన్‌తో ఘర్షణపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక అనేక విషయాల్లో దూకుడుగా వెళ్తున్నారు. అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపారు. ఇక విదేశీ విద్యార్థులను వెళ్లగొడుతున్నారు. అయితే ఎన్నికల సమయంలో రిపబ్లికన్లకు వ్యతిరేకంగా యూనివర్సిటీ పని చేసిందంటూ హార్వర్డ్ విశ్వవిద్యాలయంపై ట్రంప్ సర్కార్ కక్ష కట్టింది. అలాగే యూదు మతానికి వ్యతిరేకంగా పాఠాలు చెప్పడం.. హమాస్ మద్దతుగా విద్యార్థులను రెచ్చగొట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో 2.2 బిలియన్ డాలర్ల నిధులను ట్రంప్ సర్కార్ నిలిపివేసింది. అలాగే పన్ను మినహాయింపును నిలిపివేసింది. అంతేకాకుండా పాఠ్యాంశాల్లో మార్పులు చేయాలని, ప్రవేశాలు, నియామక పద్ధతులు కూడా మార్చాలంటూ ట్రంప్ లేఖ రాశారు.
ఇది కూడా చదవండి: Sai Pallavi : అవార్డుల కన్న నాకు ప్రేక్షకులే ముఖ్యం..
అయితే ట్రంప్ సర్కార్ ఆదేశాలను హార్వర్డ్ యూనివర్సిటీ తిప్పికొట్టింది. విద్యావ్యవస్థల్లో జోక్యం చేసుకోవద్దని.. మార్పులు, చేర్పులు చేసే ప్రసక్తలేదని తేల్చి చెప్పింది. ఇలా ట్రంప్ సర్కా్ర్‌పై తిరుగుబావుటా ఎగరవేసింది. అయితే ఈ వ్యవహారంపై అంతర్జాతీయంగా తీవ్ర సంచలనం సృష్టించడంతో వైట్‌హాస్ అధికారులు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. పొరపాటున లేఖ వెళ్లిపోయిందని.. కమిటీలో చర్చించకుండానే అధికారి పంపించేసినట్లు పేర్కొన్నారు. తాజాగా ట్రంప్ సర్కార్‌పై యూనివర్సిటీ దావా వేసింది. ఈ వ్యవహారం ఇంకెంత దూరం వెళ్తుందో చూడాలి.
ఇది కూడా చదవండి: Mulugu District: కానిస్టేబుల్ వివాహేతర సంబంధాన్ని బయటపెట్టిన యువకుడి దారుణ హత్య..
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!