Plane Crash : అమెరికాలోని కాలిఫోర్నియాలో ఓ చిన్న విమానం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, 18 మంది గాయపడ్డారు. సమాచారం ప్రకారం, ఈ విమానం గిడ్డంగిపై పడిపోయింది.
అగ్ర రాజ్యం అమెరికాలో నూతన సంవత్సరం రోజున జరిగిన ఉగ్ర దాడిని ప్రధాని మోడీ ఖండించారు. న్యూ ఓర్లీన్స్లో ఒక పికప్ ట్రక్కు అత్యంత వేగంగా జనాలపైకి దూసుకొచ్చింది.
Pakistan: ఉగ్రవాదానికి పుట్టినిల్లుగా పేరుగాంచిన పాకిస్తాన్ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తాత్కాలిక సభ్య దేశంగా చేరింది. రొటేషన్ పద్ధతిలో పాక్ కు ఈ ఛాన్స్ వచ్చింది.
Cyberattack: తమ ట్రెజరీ డిపార్ట్‌మెంట్‌పై చైనా సైబర్ దాడులకు పాల్పడినట్లు గుర్తించామని అమెరికా ఆరోపించింది. వర్క్ స్టేషన్లలో ఉన్న కీలకమైన పత్రాలను దొంగిలించేందుకు యత్నించినట్లు పేర్కొనింది.
అమెరికా వీసాల్లో రికార్డ్ సృష్టించింది. వరుసగా రెండో ఏడాది 10 లక్షలకు పైగా నాన్-ఇమ్మిగ్రెంట్ వీసాలను జారీ చేసినట్లు భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం వెల్లడించింది.
USA- Bangladesh: బంగ్లాదేశ్‌లో హిందువులతో పాటు ఇతర మైనారిటీలపై దాడులు కొనసాగుతుండటంతో ఆందోళనకర పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో అక్కడి పరిస్థితులపై ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్‌తో యూఎస్ జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలివన్ మాట్లాడినట్లు పేర్కొనింది.
S Jaishankar: నేటి నుంచి ఆరు రోజుల పాటు అమెరికాలో భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైనా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గెలిచిన తర్వాత భారత్ నుంచి అమెరికాకు వెళ్లడం ఇదే మొదటిసారి.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరికొద్ది రోజుల్లో పదవి నుంచి వైదొలగనున్నారు. దీంతో ఆయన చివరి రోజుల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. వివిధ కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న అనేక మందికి క్షమాభిక్ష ప్రసాదిస్తున్నారు.
మళ్లీ అమెరికా అధ్యక్షుడిగా కాబోతున్న డొనాల్డ్ ట్రంప్.. కెనడాను తమ దేశంలో 51వ ప్రావిన్స్‌గా మార్చాలని సరదాగా మాట్లాడారు. అయితే నేడు కెనడా ఆర్థిక పరిస్థితి దిగజారిందన్నది వాస్తవం. భారీ పన్నులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ట్రంప్ చేసిన ఈ జోక్‌ను రియాలిటీగా మార్చడం గురించి కెనడాలో చాలా మంది చర్చించుకుంటున్నారు.