Trump: హార్వర్డ్ యూనివర్సిటీపై ట్రంప్ చర్యల్లో నిజమెంత? వైట్‌హౌస్ క్లారిటీ
- హార్వర్ యూనివర్సిటీపై ట్రంప్ చర్యల్లో నిజమెంత?
- క్లారిటీ ఇచ్చిన వైట్‌హౌస్ ఉన్నతాధికారి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత కొద్దీ రోజులుగా హార్వర్డ్ యూనివర్సిటీ వ్యవహారం అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపింది. ట్రంప్ ప్రభుత్వం 2.2 బిలియన్ల గ్రాంట్లను నిలిపివేయడం, అంతేకాకుండా పన్ను మినహాయింపును ఉప సంహరించుకోవడం.. అనంతరం పాఠ్యాంశాలు కూడా మార్పులు, చేర్పులు చేయాలంటూ ట్రంప్ రాసిన లేఖ సంచలనం సృష్టించింది. విద్యాసంస్థపై ఇలాంటి ప్రతీకారం ఏంటి? అంటూ పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా ఇదే అంశంపై వైట్‌హౌస్ ఉన్నతాధికారి క్లారిటీ ఇచ్చినట్లు ది న్యూయార్క్ టైమ్స్ తెలిపింది.
ఇది కూడా చదవండి: Resonance : జేఈఈ మెయిన్‌లో ‘రెసోనెన్స్’ విజయ దుందుభి
Also Read
- Pakistan: అప్పులు చేసే పాకిస్తాన్, అప్పులిచ్చే IMFలో కీలక బాధ్యతలు..
- Donald Trump: జనం పర్సులు నిల్.. ప్రెసిడెంట్ గారి ఆదాయం మాత్రం ఫుల్..!
- Instant Noodle: ఇన్స్టంట్ నూడుల్స్ తినడంలో భారత్ రికార్డు..! చైనా, జపాన్, వియత్నాం స్థానాలివే..
- Kim Jong Un: కిమ్ కొత్త క్షిపణి ప్రయోగం.. దడదడలాడిన దక్షిణ కొరియా!
హార్వర్డ్ యూనివర్సిటీకి ట్రంప్ రాసిన లేఖ పొరపాటున వెళ్లిందని వైట్‌హౌస్ అధికారి పేర్కొన్నారు. యూనివర్సిటీలో నియామకాలు, ప్రవేశాలు, పాఠ్యాంశాల్లో మార్పులు చేయాలని కోరుతూ ట్రంప్ ప్రభుత్వం.. హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి పంపిన లేఖ పొరపాటునే వెళ్లిందని అధికారి కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. సరైన అనుమతి లేకుండా లేఖ జారీ చేయబడిందని.. వైట్‌హౌస్‌లోని కొందరు ముందుగానే పంపించేశారని పేర్కొంది. అయితే ట్రంప్ ప్రభుత్వ నిర్ణయాన్ని మాత్రం హార్వర్డ్ యూనివర్సిటీ తిప్పికొట్టింది. మార్పులు… చేర్పులు చేసే ఉద్దేశం లేదని బహిరంగంగా ప్రకటించింది. హార్వర్డ్ యూనివర్సిటీని వైట్‌హౌస్ అధికారి సంప్రదించినా ఏ మాత్రం ప్రయోజనం లేనట్టుగా తెలిపోయింది. అధికారి మాటలను లైట్ తీసుకున్నట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: Indragnti Mohana Krishna: నమ్మకాలు మూఢనమ్మకాలుగా మారితే.. “సారంగపాణి జాతకం”: ఇంద్రగంటి
వాస్తవానికి హార్వర్డ్ యూనివర్సిటీపై ట్రంప్ గుర్రుగానే ఉన్నారు. యూదు మతానికి వ్యతిరేకంగా పని చేస్తోందని.. హమాస్ మద్దతుగా విశ్వవిద్యాలయం పని చేస్తుందని ట్రంప్ ఆగ్రహంగా ఉన్నారు. అంతేకాకుండా ఎన్నికల సమయంలో తమ పార్టీకి వ్యతిరేకంగా యూనివర్సిటీ పని చేసిందన్న కోపం కూడా ట్రంప్‌లో ఉంది. ఈ నేపథ్యంలోనే యూనివర్సిటీలో మార్పులు చేయాలని లేఖ సిద్ధమైంది. అయితే లేఖపై కమిటీలో చర్చించాలి. కానీ ఆరోగ్య మరియు మానవ సేవల విభాగంలో తాత్కాలిక జనరల్ కౌన్సిల్ అధికారి సీన్ కెవెనీ ముందుగానే పంపేశారు. కెవెనీ యాంటీ సెమిటిజం టాస్క్ ఫోర్స్‌లో సభ్యుడిగా ఉన్నారు. అయితే లేఖలో ఉన్న విషయాలు నిజమైనప్పటికీ.. లేఖను పంపాలా? వద్దా అన్న గందరగోళం నెలకొన్న తరుణంలోనే కెవెనీ.. యూనివర్సిటీకి పంపేశారని వైట్‌హౌస్ అధికారి పేర్కొన్నట్లు న్యూయార్క్ టైమ్స్ నివేదిక పేర్కొంది. అయితే లేఖలోని అంశాలు సున్నితమైనవి కావడంతో అంతర్జాతీయంగా తీవ్ర దుమారం రేపాయని అధికారి చెప్పుకొచ్చినట్లు నివేదిక పేర్కొంది.
లేఖ బహిర్గతం కావడంతో ప్రస్తుతం హార్వర్డ్ యూనివర్సిటీ-ట్రంప్ ప్రభుత్వం మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇదిలా ఉంటే హార్వర్డ్ యూనివర్సిటీతో పాటు మరిన్ని వర్సిటీలు హిట్ లిస్టులో ఉన్నాయి. అయితే హిట్ లిస్ట్‌లో హార్వర్డ్ యూనివర్సిటీ ముందు ఉండడంతో బలైపోయింది.
ఇది కూడా చదవండి: Raj Kasireddy Sensational Audio: రాజ్ కసిరెడ్డి సంచలన ఆడియో.. సాయిరెడ్డి బాగోతం బయటపెడతా..
తాజావార్తలు
-
Off The Record: అదితి చుట్టూ ఉన్న సలహాదారులే ఈ పరిస్థితికి కారణమా..?
-
YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
-
Story Board: ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పని చేస్తుందా ?
-
Off The Record: ధర్మాన మంత్రాంగం.. వైసీపీలోకి గుండ ఫ్యామిలీ?
-
Off The Record: క్రాంతికి జనసేనలో నో ఛాన్స్?.. ముద్రగడ కుమార్తెపై సొంత పార్టీలో అసంతృప్తి!
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!