ఏపీలో పొత్తులపై రాజకీయాలు వేడెక్కాయి. జనసేన, టీడీపీ పొత్తు అంశంపై తీవ్ర చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. చంద్రబాబు ఎన్నికలంటే భయపడుతున్నారని.. కానీ ఎన్నికలంటే భయపడాల్సిన అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు. గడిచిన మూడేళ్లలో ఎన్నో సంక్షేమ పథకాలను తమ ప్రభుత్వం అమలు చేసిందని అంబటి రాంబాబు గుర్తు చేశారు. టీడీపీ హయాంలో టీడీపీ చేసిందేమీ లేదు కాబట్టే తనతో పొత్తు పెట్టుకోవాలని అందరి కాళ్ల, వేళ్ల మీద చంద్రబాబు…
ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబుపై మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ సెటైర్లు వేశారు. పోలవరం పనులపై మంత్రి అంబటి రాంబాబుకు శ్వేతపత్రం విడుదల చేసే దమ్ముందా అంటూ సవాల్ విసిరారు. పోలవరం ప్రాజెక్ట్ గురించి ఎవరేం అడిగినా ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు రెండు చేతులు పైకెత్తి తనకేం తెలియదంటున్నారని ఎద్దేవా చేశారు. చేయాల్సిదంతా చేసేసి.. పోలవరం నిర్మాణం ఎప్పుడవుతుందో చెప్పలేం అని సీఎం జగన్ మంత్రి అంబటితో చెప్పిస్తున్నారని…
ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అంబటి రాంబాబు తొలిసారి పోలవరం ప్రాజెక్ట్‌ను సందర్శించారు. ఈ ప్రాజెక్ట్‌పై అవగాహన పెంచుకోవడం కోసమే క్షేత్రస్థాయిలో పర్యటించడం జరిగిందని ఆయనన్నారు. ఈ ప్రాజెక్ట్ ఎప్పెడెప్పుడు పూర్తవుతుందా? అని ప్రజలు ఎదురుచూస్తున్నారని, అయితే వరద ఉధృతి కారణంగా డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడంతో ఈ ప్రాజెక్ట్ నిర్మాణం ఆలస్యం అవుతోందని అన్నారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం, తొందరపాటు చర్యల వల్ల ఆ వాల్ దెబ్బతిందని చెప్పిన రాంబాబు.. ఆ సమస్యని…
కౌలు రైతుల విషయంలో వైసీపీ సర్కారుపై విమర్శలు చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. పవన్ కళ్యాణ్ రైతుల గురించి మాట్లాడటం విచిత్రంగా ఉందని ఎద్దేవా చేశారు. కౌలు రైతులకు ఈ ప్రభుత్వం చేసిన ప్రయోజనం ఇంతవరకు ఏ ప్రభుత్వమూ చేయలేదని మంత్రి అంబటి రాంబాబు వివరించారు. కానీ ఇవేవీ పవన్ కళ్యాణ్‌కు కనిపించకపోవడం మన దౌర్భాగ్యం అన్నారు. చంద్రబాబు కోసమే ఉద్భవించిన రాజకీయ పార్టీ జనసేన అని.. పవన్…
ఏపీలో టీడీపీ వర్సెస్ వైసీపీ మధ్య మాటలయుద్ధం కొనసాగుతోంది. టీడీపీ మాజి ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి వైసీపీ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. కళ్యాణదుర్గంలో జరిగిన ఘటన పై అధికార పార్టీ నాయకులు మాట్లాడలేక పోతున్నారు. చంద్రబాబు, లోకేష్ ట్విటర్ లో పెడితే దానిపై కేసులు పెట్టారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గా ఉన్నపుడు జగన్ చంద్రబాబు ను నడి రోడ్డులో ఉరి వెయ్యండి అంటే ఏ కేసులు పెట్టలేదన్నారు. మీ సహచర మాజీమంత్రి కొడాలి నాని, తాజా…
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై నిప్పులు చెరిగారు ఏపీ ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు. చంద్రబాబు హయాంలో ప్రాధాన్యత ఉన్న కీలక పనులేవీ చేయలేదు. టీడీపీ పాలనలో కాంట్రాక్టర్లకు బాగా మిగిలే పనులు మాత్రమే చేశారు. వైసీపీ ప్రభుత్వం కీలకమైన పనులే టేకప్ చేశాం. రెండు సార్లు కోవిడ్ వచ్చినా పనులు ఆగకుండా చిత్తశుద్ధితో పని చేశాం అన్నారు అంబటి. ఈ జలయజ్ఞాన్ని వైఎస్సార్ ప్రారంభించారు.. ఆగే ప్రసక్తే లేదు. మేము అధికారంలోకి వచ్చాక ప్రాధాన్యత క్రమంలో 6…
ఏపీలో వివిధ శాఖలకు కొత్త మంత్రులు వచ్చారు. రాష్ట్రంలో కీలకంగా భావించే ఇరిగేషన్ శాఖకు పార్టీ సీనియర్ నేత, అధికారప్రతినిధి అంబటి రాంబాబు మంత్రిగా వచ్చారు. రాష్ట్ర ఇరిగేషన్ శాఖా మంత్రి అంబటి రాంబాబు మీడియా సమావేశంలో కీలక అంశాలు ప్రస్తావించారు. రాష్ట్రంలో అత్యంత కీలకమైన పదవిని ముఖ్యమంత్రి నాకు అప్పగించారు. సమర్ధవంతంగా నా బాధ్యతను పూర్తి చేస్తానన్నారు. ఆంధ్రప్రదేశ్ కి జీవనాడి అయిన పోలవరం విషయంలో పూర్తి చేసేందుకు కృషి చేస్తా. రాయలసీమ సాగు నీటి…
ఏపీ అసెంబ్లీలో మంగళవారం కూడా గందరగోళం చోటుచేసుకుంది. సభ ప్రారంభమైన వెంటనే జంగారెడ్డి గూడెం సంఘటనకు సంబంధించి న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు వచ్చి నినాదాలు చేశారు. పోడియం వద్దకు వస్తే చర్యలు తీసుకుంటామని స్పీకర్ ముందే హెచ్చరించినా టీడీపీ సభ్యులు మాత్రం వెనక్కి తగ్గలేదు. దీంతో స్పీకర్ పలువురు టీడీపీ నేతలను సభ నుంచి సస్పెండ్ చేశారు. ఈ నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు టీడీపీ…
ఏపీలో పెగాసస్ ప్రకంపనలు కలిగిస్తోంది. టెక్నాలజీకి ఆద్యుడిని అని చెప్పుకుంటారు చంద్రబాబు. మమతా బెనర్జీ సీనియర్ రాజకీయ నాయకురాలు. శాసనసభలో ఒక ముఖ్యమంత్రి హోదాలో అధికారికంగా చంద్రబాబు పెగాసస్ సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేసిన విషయాన్ని బయట పెట్టారు. చంద్రబాబు, లోకేష్ ఎందుకు భుజాలు తడుముకుంటున్నారు? మమతా బెనర్జీ పార్టీతో మాకు స్నేహపూర్వక సంబంధాలు ఏమీ లేవన్నారు. మోడీకి వ్యతిరేకంగా చంద్రబాబు, మమతా బెనర్జీ కలిసి పని చేసిన విషయం వాస్తవం కాదా? మమతా వ్యాఖ్యలు వాస్తవం కాకపోతే…