పోలవరం ప్రాజెక్టు విషయంలో ఏపీ ప్రభుత్వం వైఖరిపై మాజీ మంత్రి దేవినేని ఉమా విమర్శలు చేశారు. పోలవరం ప్రాజెక్టుపై సీఎం జగన్ మౌనం రైతులకు శాపంగా మారిందని.. ఇప్పటికైనా సీఎం జగన్ నోరు విప్పాలని దేవినేని ఉమా డిమాండ్ చేశారు. జోకర్ లాంటి జలవనరుల మంత్రి అంబటి రాంబాబుతో పిచ్చి మాటలు మాట్లాడిస్తే సరిపోదన్నారు. చంద్రబాబు, దేవినేని ఉమాని తిడితే పోలవరం పూర్తికాదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. సీఎం జగన్ మూర్ఖత్వం, డబ్బు వ్యామోహం, తెలివి తక్కువతనం, అవగాహనారాహిత్యమే…
కృష్ణా డెల్టా రైతులకు ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు శుభవార్త తెలిపారు. జూన్ పదో తేదీ నుండి కృష్ణా డెల్టాకు సాగు నీరు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మంత్రి అంబటి తెలిపారు. ఎమ్మెల్యే ఉదయభానుతో కలిసి పులిచింతల ప్రాజెక్టుని సందర్శించారు మంత్రి అంబటి రాంబాబు. గత ఏడాది ఆగస్టులో కొట్టుకుపోయిన గేటు ప్రాంతాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు మంత్రి. గతంలో ఎప్పుడూ లేని విధంగా జూన్ లోనే సాగునీరు ఇవ్వనున్నాం. పులిచింతలలో 33 టీఎంసీల నీరు…
ట్విటర్లో మంత్రి అంబటి రాంబాబు, టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. రాజకీయం దగ్గర నుంచి వ్యక్తిగత వ్యవహారాల దాకా వీరి మధ్య వార్ వెళ్ళింది. మాజీ మంత్రి నారాయణను అరెస్ట్ చేసిన విషయంపై రాంబాబు చేసిన ట్వీట్‌కి గాను.. కాంబాబు అంటూ అయ్యన్నపాత్రుడు బదులిచ్చినప్పటి నుంచి ఈ ట్విటర్ వార్ వ్యక్తిగతంగా మలుపు తీసుకుంది. ఒకరిపై మరొకరు తీవ్ర స్థాయిలో ఆరోపణలు, విమర్శలు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా.. అప్పట్లో రాంబాబు ఓ…
‘గడప గడపకు మన ప్రభుత్వం’ పేరుతో వైసీపీ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంలో భాగంగా పలుచోట్ల నేతలకు ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురైంది. దీన్ని బట్టే వైసీపీ పాలన పట్ల ప్రజలు ఎంత వ్యతిరేకంగా ఉన్నారో తెలిసిపోతోందని టీడీపీ నేతలు విమర్శలు చేయడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే ఈ అంశంపై వివరణ ఇచ్చేందుకు ఏపీ మంత్రి అంబటి రాంబాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలేనంటూ ఆయన తీవ్ర ఆగ్రహావేశాలకు గురయ్యారు. తమ…
నెల్లూరు జిల్లాలోని పెన్నా, సంగం బ్యారేజ్ పనులను సోమవారం ఉదయం మంత్రులు కాకాణి గోవర్ధన్ రెడ్డి, అంబటి రాంబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలోని బ్యారేజీలకు వైఎస్ఆర్ శంకుస్థాపన చేశారని .. ఆయన మరణం తర్వాత పనులు ఆగిపోయాయని తెలిపారు. 30 శాతం పనులు చేసి టీడీపీ నేతలు గొప్పలు చెప్పుకున్నారని ఆయన మండిపడ్డారు. ఇప్పటికే 90 శాతం పనులు పూర్తయ్యాయని.. త్వరలోనే పెండింగ్ పనులను పూర్తి చేస్తామని మంత్రి కాకాణి…
ఏపీలో పొత్తులపై రాజకీయాలు వేడెక్కాయి. జనసేన, టీడీపీ పొత్తు అంశంపై తీవ్ర చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. చంద్రబాబు ఎన్నికలంటే భయపడుతున్నారని.. కానీ ఎన్నికలంటే భయపడాల్సిన అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు. గడిచిన మూడేళ్లలో ఎన్నో సంక్షేమ పథకాలను తమ ప్రభుత్వం అమలు చేసిందని అంబటి రాంబాబు గుర్తు చేశారు. టీడీపీ హయాంలో టీడీపీ చేసిందేమీ లేదు కాబట్టే తనతో పొత్తు పెట్టుకోవాలని అందరి కాళ్ల, వేళ్ల మీద చంద్రబాబు…
ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబుపై మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ సెటైర్లు వేశారు. పోలవరం పనులపై మంత్రి అంబటి రాంబాబుకు శ్వేతపత్రం విడుదల చేసే దమ్ముందా అంటూ సవాల్ విసిరారు. పోలవరం ప్రాజెక్ట్ గురించి ఎవరేం అడిగినా ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు రెండు చేతులు పైకెత్తి తనకేం తెలియదంటున్నారని ఎద్దేవా చేశారు. చేయాల్సిదంతా చేసేసి.. పోలవరం నిర్మాణం ఎప్పుడవుతుందో చెప్పలేం అని సీఎం జగన్ మంత్రి అంబటితో చెప్పిస్తున్నారని…
ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అంబటి రాంబాబు తొలిసారి పోలవరం ప్రాజెక్ట్‌ను సందర్శించారు. ఈ ప్రాజెక్ట్‌పై అవగాహన పెంచుకోవడం కోసమే క్షేత్రస్థాయిలో పర్యటించడం జరిగిందని ఆయనన్నారు. ఈ ప్రాజెక్ట్ ఎప్పెడెప్పుడు పూర్తవుతుందా? అని ప్రజలు ఎదురుచూస్తున్నారని, అయితే వరద ఉధృతి కారణంగా డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడంతో ఈ ప్రాజెక్ట్ నిర్మాణం ఆలస్యం అవుతోందని అన్నారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం, తొందరపాటు చర్యల వల్ల ఆ వాల్ దెబ్బతిందని చెప్పిన రాంబాబు.. ఆ సమస్యని…
కౌలు రైతుల విషయంలో వైసీపీ సర్కారుపై విమర్శలు చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. పవన్ కళ్యాణ్ రైతుల గురించి మాట్లాడటం విచిత్రంగా ఉందని ఎద్దేవా చేశారు. కౌలు రైతులకు ఈ ప్రభుత్వం చేసిన ప్రయోజనం ఇంతవరకు ఏ ప్రభుత్వమూ చేయలేదని మంత్రి అంబటి రాంబాబు వివరించారు. కానీ ఇవేవీ పవన్ కళ్యాణ్‌కు కనిపించకపోవడం మన దౌర్భాగ్యం అన్నారు. చంద్రబాబు కోసమే ఉద్భవించిన రాజకీయ పార్టీ జనసేన అని.. పవన్…
ఏపీలో టీడీపీ వర్సెస్ వైసీపీ మధ్య మాటలయుద్ధం కొనసాగుతోంది. టీడీపీ మాజి ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి వైసీపీ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. కళ్యాణదుర్గంలో జరిగిన ఘటన పై అధికార పార్టీ నాయకులు మాట్లాడలేక పోతున్నారు. చంద్రబాబు, లోకేష్ ట్విటర్ లో పెడితే దానిపై కేసులు పెట్టారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గా ఉన్నపుడు జగన్ చంద్రబాబు ను నడి రోడ్డులో ఉరి వెయ్యండి అంటే ఏ కేసులు పెట్టలేదన్నారు. మీ సహచర మాజీమంత్రి కొడాలి నాని, తాజా…