Ambati Rambabu Bhogi Dance: తెలుగు రాష్ట్ర ప్రజలకు మాజీ మంత్రి అంబటి రాంబాబు భోగి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఇవాళ ( జనవరి 14న) వేకువ జామున ఆయన ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా కేంద్రంలో భోగి సంబరాలు ఘనంగా జరిగాయి.
Ambati Rambabu: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. మాస్ పార్టీ అని వ్యాఖ్యానించారు మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు.. అందుకే పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎక్కడకు వెళ్లినా లక్షలాది మంది ప్రజలు తరలివస్తారని అన్నారు. గుంటూరులో జరిగిన పార్టీ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీని మరింత బలోపేతం చేసే దిశగా సంస్థాగత నిర్మాణం చేపట్టాలని జగన్ ఆదేశించారని అంబటి రాంబాబు తెలిపారు. రానున్న 45 రోజుల్లో…
ఢిల్లీ స్థాయిలో పలుకుబడి ఉన్న ఆ టీడీపీ నేత సొంత గల్లీలో ఒంటరి పోరాటం చేస్తున్నారా? చుట్టూ ఉన్న వాళ్ళు మనం మనం బరంపురం అని పైకి అంటున్నా… లోపల మాత్రం కడుపులో కత్తులు పెట్టుకుని తిరుగుతున్నారా? ముందొచ్చిన చెవులకంటే వెనక వచ్చిన కొమ్ములు వాడి అన్న సామెతను గుర్తు చేసుకుంటూ కామ్ అయిపోతున్నారా? ఎవరా లీడర్? సొంత పార్టీలోనికి కొందరు ఆయన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?. పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన కొద్ది రోజుల్లోనే పెద్ద పదవులు దక్కించుకోగలిగిన…
బాగా నోరున్న మా పార్టీ నేతల్లో అంబటి రాంబాబు తొలి వరుసలో ఉంటారని చమత్కరిస్తుంటారు వైసీపీ నాయకులు. అందుకు తగ్గట్టే బయట కూడా ఆయనకు ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉంది. ఇక ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతకాలం వైసీపీ నేతలు సైలెంట్ అయిపోయినా.. తర్వాత అందరికంటే ముందు సర్కార్ మీద వాయిస్ రెయిజ్ చేశారు అంబటి.
Ambati Rambabu: పోలవరాన్ని చంద్రబాబు సర్వనాశనం చేశారు అని వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. దాన్ని బ్యారేజికే పరిమితం చేశారు.. 41 మీటర్లకే పూర్తి చేస్తుంటే కూటమి నేతలు ఏం చేస్తున్నారు?.. ఇప్పుడు చంద్రబాబు, వారి కేంద్ర మంత్రులు గుడ్డి గుర్రాలకి పళ్లు తోముతున్నారా? అని ప్రశ్నించారు.
Ambati Rambabu: ఏపీ రాజధాని అమరావతి కథ.. అంతులేని కథలా మారింది అని వైసీపీ మాజీమంత్రి అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబు తిరిగి అధికారంలోకి వస్తే తమకు లబ్ది చేకూరుతుందని ఈ ప్రాంత రైతులు ఉద్యమాలు కూడా చేశారు.. అమరావతి రైతుల పరిస్థితి దారుణంగా ఉంది.
మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇక పోలీస్ రాడార్ పరిధిలోకి వచ్చేశారా? ఆయన విషయంలో ఇన్నాళ్లు ఒక ఎత్తు… ఇక నుంచి మరో ఎత్తు అన్నట్టుగా ఉండబోతోందా? అంబటికి కూడా అదే ఫీలింగ్ వచ్చేసిందా? ఎక్స్ మినిస్టర్ విషయంలో సడన్గా జరిగిన మార్పు ఏంటి? ఇన్నాళ్ళుగా లేనిది… ఇప్పుడెందుకు అరెస్ట్ భయాలు మొదలయ్యాయి? వైసీపీ ఫైర్బ్రాండ్ లీడర్ అంబటి రాంబాబు. పార్టీ అధికారంలో ఉన్నా… ప్రతిపక్షంలో ఉన్నా… ఎప్పుడూ ఏదో ఒక ఎపిసోడ్తో వార్తల్లో నలుగుతుంటారాయన. ఈ…
Ambati Rambabu: మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు చేశారు పోలీసులు.. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధారం రోజు రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించిన విషయం విదితమే కాగా.. ర్యాలీ కి అనుమతి లేదంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబును అడ్డుకున్నారు పోలీసులు.. దీంతో, పోలీసులతో వాగ్వాదానికి దిగారు రాంబాబు.. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను నెట్టి వేసి తన అనుచరులను తీసుకెళ్లారు.. ఈ నేపథ్యంలో పోలీసులు,…
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా కోర్టు ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా కూడా పాల్గొన్నారు.